సరిలేరు నీకెవ్వరు: నా కెరీర్‌లో బెస్ట్ డిసీజన్ ఇదే.. మహేష్ బాబు రెస్పాన్స్
గత కొన్నేళ్లుగా సూపర్ ఫామ్ కొనసాగిస్తూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇటీవలే తన 25వ 'మహర్షి'తో గత రికార్డులు తిరగరాసిన ఆయన ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' అంటూ 2020 కి స్వాగతం పలికారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్.. ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలిపారు. వివరాల్లోకి పోతే..

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్.. సూపర్ హిట్ హీరో మహేష్
గతేడాది సంక్రాంతి కానుకగా F2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న అనిల్ రావిపూడి.. ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరు' అంటూ సంక్రాంతి బరిలో నిలిచారు. ఇక ఈ సినిమాలో సూపర్ హిట్ హీరో మహేష్ బాబు సందడి చేశారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్, సూపర్ హిట్ హీరో కాంబో కావడంతో ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

చాలా రోజులైంది.. బెస్ట్ డిసీజన్
అయితే ఈ సినిమా గురించి తాజాగా మహేష్ బాబు రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు తన కెరీర్‌లో తీసుకున్న బెస్ట్ నిర్ణయాల్లో ఇదొకటని తెలిపారు. తాను మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా చేసి చాలా రోజులైందని, అలాగే ఆర్మీ నేపథ్యంలో కూడా తాను ఇప్పటివరకు సినిమా చేయలేదని చెప్పారు. ఈ రెండింటి కలయికతో అనిల్ కథ చెప్పారని అన్నారు. ఈ సినిమా చేయాలనుకోవడం తాను తీసుకున్న మంచి నిర్ణయం అని మహేష్ పేర్కొన్నారు.

క్లాస్, మాస్ అన్ని ఏరియాల్లో..
ఇక ఈ రోజే (జనవరి 11) విడుదలైన ఈ సినిమా సూపర్ టాక్ తెచ్చుకుంది. మొదటి ఆట పడకముందే ప్రీమియర్స్ ద్వారానే సక్సెస్‌ఫుల్ సినిమాగా చెప్పుకోబడుతోంది. థియేటర్స్ అన్నీ ప్రేక్షకులతో నిండిపోయాయి. క్లాస్, మాస్ అన్ని ఏరియాల్లో సరిలేరు నీకెవ్వరు సక్సెస్ అనిపించుకుంటోంది.
Recommended Video

సరిలేరు నీకెవ్వరు మూవీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. విజయశాంతి కీలక పాత్ర పోషించింది. బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్ ఇతర పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











