కుర్రకారుకి హార్ట్ బీట్ తెప్పించే ఈ సుందరి మహేష్ బాబును కూడ పడగొట్టింది...!
తన నటనతో, అందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో కడు నేర్పరి అయిన జెనీలియా..హీరోలను ఆకట్టుకోవడంలోనూ మహా సిద్ధహస్తురాలే. ఇక నుంచి సంవత్సరానికి మినిమం మూడు సినిమాల్లో నటించాలని నిర్ణయానికొచ్చిన మహేష్ బాబుతో జత కట్టే ఛాన్స్ కొట్టేసేందకు తన వంతు కృషి తాను చేస్తోంది. మధ్యవర్తుల్ని నమ్ముకోవడం వధా అనుకుందో ఏమో, తనే నేరుగా రంగంలోకి దూకేసింది. మహేష్ బాబుకు ఫోన్ చేసి, మాటలతోనే అతడ్ని సగం బుట్టలో వేసేసి, మిగతా సగం స్వయంగా వెళ్లి తన చేతులతో తనే తన బుట్టలో వేసుకోవడం ఉత్తమమని నిర్ణయానికొచ్చి..డైరెక్ట్ గా షూటింగ్ స్పాట్ లో మహేష్ బాబు ఎటాక్ చేసేసింది.
తన చిలిపి నవ్వుతో కుర్రకారుకి హార్ట్ ఎటాక్ తెప్పించే ఈ సుందరి చేసిన డేర్ నెస్ కు మహేష్ బాబు కూడా ప్లాట్ అయిపోయాడు. తన తదుపరి చిత్రంతో తప్పక అవకాశమిస్తానని..షూటింగ్ స్పాట్ లో ఉన్న యూనిట్ మెంబర్స్ సాక్షిగా హామీ ఇచ్చేసాడు. అయితే ఈ సాక్ష్యం సరిపోదనుకుందో ...ఏమో, తను మహేష్ బాబును డైరెక్ట్ గా షూటింగ్ స్పాట్ లో కలిసిన విషయం, తర్వాత సినిమాలో తనతో కలిసి నటించే అవకాశమిస్తానని మహేష్ బాబు ప్రామిస్ చేసిన విషయం మీడియాలో ప్రముఖంగా కవర్ అయ్యేలా తగిన జాగ్రత్తలు తీసుకుంది. మహేష్ బాబు ఒకసారి కమిట్ అయితే..తన మాట కూడా తనే వినడనే విషయం జెనీలియాకు తెలియకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే.


Click it and Unblock the Notifications











