నిజమైన స్టార్ అంటే అతడే : మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సెంచరీల వీరుడు సచిన్ టెండూల్కర్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో సచిన్ 100వ వందను సాధించిన నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా సచిన్ ను అభినందించారు. నిజమైన స్టార్, నిజమైన లెజెండ్ అంటే సచినే, చాలా బాగా ఆడాడు అంటూ పేర్కొన్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు సాధించిన ఏకైక క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్. 33 ఇన్నింగ్సు తర్వాత సచిన్ టెండూల్కర్ వంద సెంచరీల ఫీట్ సాధించాడు. టెస్టుల్లో 51 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. వన్డేల్లో సచిన్ టెండూల్కర్ 95 అర్థ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో 66 అర్థ సెంచరీలు సాధించాడు. 1990లో సచిన్ టెండూల్కర్ మొదటి సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికాపై ప్రపంచ కప్ పోటీల్లో 99వ సెంచరీ సాధించాడు. క్రికెట్ క్రీడలో రికార్డులు బద్దలు కొట్టుకుంటూ పోతున్నాడు.
మహేష్ బాబు విషయానికొస్తే ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేయడానికి కూడా మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.


Click it and Unblock the Notifications











