అమితానందంతో ఉక్కిరిబిక్కిరిఅవుతోన్న మహేష్ బాబు...!?
దూకుడు రిలీజ్ అయ్యి వారం రోజులు పూర్తిఅయింది. ఈ వారం రోజులూ రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది 'దూకుడు" ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చెయ్యని శ్రీను వైట్ల, నిర్మాతలు షాక్ అవుతున్నారు. హిట్ అవుతుందనుకున్నారు కానీ, ఇండస్ట్రీ హిట్ అయ్యేంత హైప్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చెయ్యలేదు. సాధారణంగా పెద్ద హీరోల సినిమాల్ని లెక్కకు మించిన థియేటర్స్ లో రిలీజ్ చేస్తుంటారు. సినిమా ఎలా ఉన్నా టాక్ స్ప్రెడ్ అవకముందే కలెక్షన్లు రాబట్టుకోవాలని నిర్మాతలు ఆశపడతారు.
అయితే 'దూకుడు" మాత్రం దాదాపు విడుదలైన అన్ని సెంటర్లలో రన్ అవుతూనే వుంది. ఓవర్సీస్ లో ఇదివరకు ఏ సినిమాకీ లేని రికార్డును 'దూకుడు" సొంతం చేసుకోబోతోంది. 'దూకుడు" సినిమా కలెక్షన్స్ అనూహ్య రీతిలో వుండటమే అందుకు కారణం. దానికి మొదటి కారణం మహేష్‌బాబు కావడం అందరికీ తెలిసిందే. అంతే కాదు బాలీవుడ్ మరియు ఇంటెల్ మీడియా కూడా ఈ సినిమా సక్సస్ పై ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగా అమెరికన్ న్యూస్ పేపర్ 'లాస్ ఎంజెల్స్ టైమ్స్" ఒక అర్టికల్ వ్రాసింది. ఆ వార్తను చూసిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ విషయాన్ని నమ్మలేకపోతోంది. ఆ న్యూస్ చూసిన ఆనందంతో ఉక్కిబిక్కిరవుతున్న మహేష్ బాబు స్టన్నింగ్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది...ఇంతకంటే నేనేం చెప్పగలను ప్రేక్షకులకు ఇంతటి బిగ్ హిట్ చేసిన అభిమానలకు, ఫ్యాన్స్ కు ప్రతి ఒక్కరికీ తన అభినందనలు తెలిపాడు.


Click it and Unblock the Notifications











