మహేష్ బాబు సరికొత్త రికార్డ్, తొలి తెలుగు హీరో!
హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో రికార్డు నమోదు చేశాడు. ఈ రికార్డు నమోదు చేసిన తొలి తెలుగు హీరో మహేష్ బాబే కావడం గమనార్హం. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో దేశ విదేశాల్లో అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ బాబు ట్విట్టర్లో 1 మిలియన్ మార్కను అందుకున్నాడు. తెలుగు హీరోల్లో మహేష్ బాబుకు తప్ప ఈ రేంజ్ లో ఎవరికీ ట్విట్టర్ ఫాలోవర్స్ లేరు.
మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. ది. ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

'ఆగడు' పూర్తయ్యాక మహేష్ సెట్‌కు వెళుతోంది ఇప్పుడే. దాంతో అందరి దృష్టీ ఈ చిత్రంపై ఉంది. కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడంటున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్ శైలికి తగ్గట్టుగా మాస్ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.
జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహేష్‌బాబు శైలికి తగిన కథ ఇది. కుటుంబ బంధాలకూ చోటుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించే బాణీలు ఆకట్టుకొంటాయని నిర్మాతలు చెప్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.


Click it and Unblock the Notifications











