ఇది చాలా కష్టం.. కొడుకుతో మహేష్ బాబు క్యూట్ లుక్

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ స్టార్ అయినప్పటికీ తన ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి చాలా నేచురల్ గా ఉంటారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఏ మాత్రం గ్యాప్ దొరికినా కూడా ఫ్యామిలీతో కలిసి విహార యాత్రలకు వెళుతుంటాడు. పిల్లల విషయంలో మహేష్ ఎలా ఆలోచిస్తారో ఆయన పోస్ట్ చేసే ఫొటోలను చూస్తే చాలా ఈజీగా అర్ధమవుతుంది. ఎప్పుడు ఫొటోలు షేర్ చేసినా కూడా ట్రేండింగ్ లిస్ట్ లో చేరతాయి.

ఇక ఇటీవల మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి హాలిడే వెకేషన్స్ కి వెళ్లిన విషయం తెలిసిందే. ఎయిర్ పోర్ట్ దగ్గరి నుంచే మహేష్ తన కొడుకు కూతురితో ఉన్న ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. కొద్దిసేపటి క్రితం సూపర్ స్టార్ తన కొడుకు గౌతమ్ తో ఉన్న ఒక క్యూట్ ఫొటోను షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు అతన్ని హగ్ చేసుకోవడం చాలా కష్టం అంటూ ప్రేమతో దగ్గరికి తీసుకోవడానికి సరైన సమయం, కారణం కూడా అవసరం లేదని మహేష్ ట్వీట్ చేశాడు. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Mahesh babu cute look with his son gautham

మహేష్ బాబు సర్కారు వారి పాట కోసం న్యూ లుక్ ని గత కొంత కాలంగా అలానే మెయింటైన్ చేస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక హాలిడేస్ అనంతరం మహేష్ యూఎస్ లో స్టార్ట్ చేయనున్న షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. ఆ షెడ్యూల్ అనంతరం హైదరాబాద్ లోనే మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X