ప్రభుదేవా దర్శకత్వంలో మహేష్ బాబు!

By Bojja Kumar

హైదరాబాద్: మీరు చదివింది నిజమే! సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రభుదేవా దర్శకత్వంలో చేయబోతున్నాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో ప్రత్యేకంగా సినిమా మాత్రం రావడం లేదు. ఏంటి కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అసలు వివరాల్లోకి వెళితే.... మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలోని పాటలకు నృత్య దర్శకత్వం ప్రభుదేవా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్ గా కనిపించనున్న నేపథ్యంలో..... రాక్ స్టార్ పాత్రకు ముడి పడి ఉన్న రెండు పాటలకు ప్రభుదేవా నృత్య దర్శకత్వం చేయబోతున్నారు. ఈ పాటల్లో డాన్స్ కు అధిక ప్రాధాన్యత ఉండటంతో టాప్ కొరియోగ్రాఫర్ అయిన ప్రభుదేవాను దర్శకుడు సుకుమార్ సంప్రదించడంతో వెంటనే ఓకే చేసాడట.

ప్రస్తుతం ప్రభుదేవా దర్శకుడిగా మారి పలు బాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నాడు. తనకు కొరియోగ్రఫీ చేసే సమయం లేక పోయినా మహేష్ బాబు లాంటి పెద్ద హీరోల సినిమాలు కావడంతో కాదన లేకపోయాడట. ఇలా చేయడం ద్వారా మున్ముందు మహేష్ బాబుతో డైరెక్ట్ సినిమా చేసే అవకాశం కూడా దక్కొచ్చనేది ప్రభు దేవా ఆలోచనలా కనిపిస్తోంది.

ఈ చిత్రంలో మహేష్ సరసన క్రితి సానన్ అనే కొత్త అమ్మాయి అమ్మాయి ఎంపికైంది. ఇప్పటి వరకు మొడలింగ్ రంగంలో రాణిస్తున్న ఆమెకు ఇదే తొలి సినిమా అవకాశం. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X