అరెరే ఇది కలలా ఉన్నదే.... మహేష్ బాబు కూతురు వీడియో వైరల్!
మహేష్ బాబు కూతురు సితారకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన తండ్రి నటించిన 'భరత్ అనే నేను' చిత్రంలోని పాట పాడుతూ సితార ఈ వీడియోలో కనిపించింది. ఈ వీడియోను నమ్రత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
'అరెరే ఇది కలలా ఉన్నదే..' అనే పాటను సితార ఏ మాత్రం లయ తప్పకుండా పాడి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ వయసులోనే ఆమె ఇంతటి టాలెంట్ ప్రదర్శించడాన్ని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. భవిష్యత్తులో సితార మహేష్ బాబు సినిమాకు పాట పాడితే బావుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన కుమార్తె పాటలు బాగా పాడుతుందని మహేష్ బాబు కూడా గతంలో ఓసారి వెల్లడించిన సంగతి తెలిసిందే.
కాగా... 'భరత్ అనే నేను' చిత్రం తొలివారంలోనే వరల్డ్ వైడ్ రూ. 161.28 కోట్లు వసూలు చేసి ట్రేడ్ పండితులను ఆశ్చర్య పరిచింది. ఇది ఏ మాత్రం ఫేక్ రికార్డ్స్ కాదు. ఒరిజినల్ కలెక్షన్ నిర్మాత దానయ్య కూడా స్పష్టం చేశారు.
హైదరాబాద్ నోవాటెల్‌లో జరిగిన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌లో మహేష్ బాబు ఈ సినిమా గురించి మాట్లాడుతూ అమ్మగారి పుట్టినరోజు ఏప్రిల్ 20న సినిమా విడుదలైంది. నాన్నగారి పుట్టినరోజు మే 31 వరకు షేర్స్ ఇలానే చెబుతూ ఉండాలి సార్ మీరంతా... ఈ రోజు ఇంత పెద్ద వేడుక జరుపుకోవడం మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంటుందన్నారు.


Click it and Unblock the Notifications











