Don't Miss!
- News
ప్యాకేజీ స్టార్ దేశభక్తి ఇది.. రిపబ్లిక్ డే సాక్షిగా మళ్ళీ దొరికిన పవన్ కళ్యాణ్!!
- Finance
world economy: ప్రపంచ దేశాల ఆర్థిక ర్యాంకుల్లో మనమెక్కడ ?
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Sitara: హీరోయిన్ తరహాలో మహేష్ కూతురు ఫొటో షూట్స్.. ఇలా ఊహించి ఉండరు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోవర్స్ ను అయితే సంపాదించుకుంది. చూడగానే అందమైన చిరునవ్వుతో ఎంతగానో ఆకట్టుకునే ఈ చిన్నారి అప్పుడప్పుడు కొన్ని ఫోటోలతో కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇక ఇటీవల ఆమె స్పెషల్ గా ఫోటోషూట్స్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించిన ఫోటో వివరాలలోకి వెళితే..

ఫ్యాన్స్ లో మంచి క్రేజ్
సితార ఘట్టమనేని కేవలం వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా ఫ్యాన్స్ కు కూడా ఎంతగానో నచ్చుతుంది. ఒక విధంగా తండ్రి తరహాలోనే ఆమె తన నిర్మలమైన మనసుతోనే తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఆమెకు సోషల్ మీడియాలో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది. సితార ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

ఆమె చూపించే ప్రేమ
సితార మాట్లాడుతూ ఉంటేనే చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇక తన ఆలోచన విధానం కూడా ఎంతో విభిన్నంగా ఉంటుంది. సొంతంగా యూట్యూబ్ ఉన్న విషయం తెలిసిందే. సితార ఎప్పుడు చూసినా ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తుంటుంది. ఇక తన తండ్రిపై ఆమె చూపించే ప్రేమ కూడా అమితంగా ఉంటుంది. అందుకే సీతార సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులను మాత్రమే కాకుండా ఇతర నెటిజన్లను కూడా ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది.

సితార ఉంటే సంతోషమే
ఇక సితార ఘట్టమనేని గురించి ఇటీవల తల్లి నమ్రత చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. గౌతమ్ పుట్టిన తర్వాత అసలు సితార మా లైఫ్ లోకి వస్తుంది అని ఊహించలేదు అని మేము ప్లాన్ చేసుకోలేదు అని ఆమె సరదాగా చెప్పారు. కానీ మా ఇంట్లో అందరికీ తను ఒక బూస్ట్ ఇస్తుంది అని తను చుట్టుపక్కల ఉంటే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అని నమ్రత తెలియజేశారు.

అద్భుతమైన డ్యాన్స్
అయితే సితార తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అప్పుడప్పుడు పోస్ట్ చేసే కొన్ని రీల్స్ కూడా చాలా డిఫరెంట్ గా వైరల్ అవుతూ ఉంటాయి. ఆమె ఎక్కువగా తన తండ్రికి సంబంధించిన డైలాగ్స్ తో పాటు పాటలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక చివరగా సర్కారు వారి పాట సినిమాలో పెన్ని అనే సాంగ్లో అద్భుతమైన డ్యాన్స్ తో మెప్పించిన విషయం తెలిసిందే.

బ్యూటీఫుల్ ఫొటో షూట్
ఇక సితార ఇటీవల ఒక స్పెషల్ ఫోటోషూట్ నిర్వహించింది అందులోనే చందమామ తరహాలో చాలా అందంగా కనిపించింది. గతంలో కూడా ఎంతో క్యూట్ గా ఫోటోలకు స్టిల్ ఇచ్చిన సితార పాప ఇప్పుడు కూడా మరింత అందంగా ఆకట్టుకునే విధంగా చిరునవ్వులతో కనిపించింది. ఇక ఆ ఫోటోలో చూసిన ఫ్యాన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు అంటూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు.