బిగ్‌ బ్రాండ్‌కు సితారా బ్రాండ్ అంబాసిడర్.. మహేష్ బాబు కూతురు క్రేజ్ మామూలుగా లేదుగా!

టాలీవుడ్‌లో తనదైన కమర్షియల్ చిత్రాలతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ టాప్ హీరోగా సత్తా చాటుతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ మధ్య వరుస హిట్లను అందుకుని హ్యాట్రిక్ సాధించిన అతడు.. గత ఏడాది 'సర్కారు వారి పాట' అనే సినిమాతో వచ్చాడు.

ఇక, ఇప్పుడేమో ఈ స్టార్ హీరో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్టులో నటిస్తోన్నాడు. అలాగే, ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగానూ వ్యవహరిస్తూ దూసుకుపోతోన్నాడు. ఇప్పుడు అతడి బాటలోనే కూతురు సితార కూడా పయనిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

Mahesh babu daughter sitara ghattamaneni ad shoot for brand promotions

చిన్న వయసులోనే ఫేమస్: సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమార్తెగా ప్రపంచానికి పరిచయమైన సితార ఘట్టమనేని.. చిన్న వయసులోనే యమ ఫేమస్ అయింది. షూటింగ్ సెట్లలో తరచూ తన తండ్రితో కనిపిస్తూ.. హీరోయిన్లతో ఆడుకుంటూ ఉన్న ఆమె ఫొటోలు, వీడియోలు అప్పట్లో హల్‌చల్ చేసేవి. దీంతో ఈ చిన్నారి నిత్యం వార్తల్లోనే నిలుస్తూ యమ హైలైట్ అవుతూ ఉండేది.

Mahesh babu daughter sitara ghattamaneni ad shoot for brand promotions

సోషల్ మీడియాలో క్రేజ్: ఘట్టమనేని సితార చిన్న వయసులోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో బాగా యాక్టివ్‌గా ఉంటోన్న ఈ చిన్నారి తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే, ఎన్నో అప్‌డేట్లను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ముఖ్యంగా సితార తరచూ రీల్స్ చేస్తుంటుంది. వీటిలో ఈ బుడ్డది తనదైన టాలెంట్లతో మెప్పిస్తూ ఉంటుంది.

Mahesh babu daughter sitara ghattamaneni ad shoot for brand promotions

సినిమాల్లోకి.. ఆ పాటతో: మహేశ్ బాబు ముద్దుల కూతురు సితార చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆమె తన తండ్రి సినిమాతోనే తెరంగేట్రం చేస్తుందని అన్నారు. కానీ, అలా జరగలేదు. అయితే, గత ఏడాది వచ్చిన 'సర్కారు వారి పాట' లిరికల్ వీడియోలో మాత్రం సితార తళుక్కున మెరిసింది. అందులో అదిరే డ్యాన్స్ చేసింది.

Mahesh babu daughter sitara ghattamaneni ad shoot for brand promotions

ఇప్పుడే బ్రాండ్ వ్యాల్యూ: తండ్రి మహేశ్ బాబు లాగే చిన్నారి సితార కూడా చిన్న వయసులోనే బ్రాండ్ వ్యాల్యూను సంపాదించుకుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆమె కొన్ని కంపెనీలకు సంబంధించిన బ్రాండ్ల వ్యాపార ప్రకటనల్లో పాల్గొంది. అందులో మహేశ్ బాబు, నమ్రత కూడా కనిపించారు. వీటికి మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఆమె కోసం చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయి.

Mahesh babu daughter sitara ghattamaneni ad shoot for brand promotions

జ్యూయెలరీ కంపెనీ యాడ్: తాజాగా సితార ఓ వ్యాపార ప్రకటనలో నటించింది. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఇది ఓ ఫేమస్ జ్యూయెలరీ కంపెనీకి సంబంధించిన యాడ్ అని తెలిసింది. ఈ కంపెనీకి సితార బ్రాండ్ అంబాసీడర్‌గా మారిందట. అందుకే ఇప్పుడామె ఇందులో ఓ యాడ్ చేసినట్లు తెలిసింది. దీన్ని టాలీవుడ్ టెక్నీషియన్లే రూపొందించారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X