మహేష్ బాబు కూతురు ఎంత ముద్దొస్తోందో (ఫోటోలు)
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత దంపతులు తమ రెండో సంతానంగా సితారకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. జులై 20, 2012న సితార జన్మించింది. మరికొన్ని రోజుల్లో సితార వయసు రెండు సంవత్సరాలు పూర్త కాబోతోంది. ఈ నేపథ్యంలో తన చిన్నారి కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట మహేష్ బాబు.
గ్రాండ్‌గా అంటే సినిమా పరిశ్రమకు చెందిన వారిని పిలవడం కాదు...సితార వయసు పిల్లలు, గౌతం వయసు పిల్లల మధ్య పుట్టినరోజు వేడుక గ్రాండ్‌గా జరుపనున్నారు. తన వయసు మారి మధ్య చేస్తే సితార మరింత ఆనంద పడుతుందనే ఉద్దేశ్యంతోనే ఇలా ప్లాన్ చేస్తున్నాడట.
ప్రస్తుతం సితారకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. గతంలో మహేష్ బాబు సితారకు సంబంధించిన ఫోటోలు ట్విట్టర్లో పోస్టు చేసారు. తాజాగా మరో ఫోటో ఇంటర్నెట్లో దర్శనమిస్తోంది. ఈ ఫోటోలో సితార ఎంతో ముద్దుస్తోంది.

సితార
మహేష్ బాబు కూతురు సితారకు సంబంధించిన ఈ ఫోటో ఇపుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో సితార ఎంతో ముద్దొస్తోందని అంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్.

మహేష్ బాబు ముద్దుల కూతురు
సితార అంటే మహేష్ బాబుకు ప్రాణం. సితార తన ఇంటి మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారు మహేష్ బాబు.

పిల్లలంటే ప్రాణం
మహేష్ బాబుకు తన ఇద్దరు పిల్లపై ఎంతో ప్రేమ. అఫ్ కోర్స్ తల్లిదండ్రులెవరైనా ఇలాగే ఉంటారనుకోండి. షూటింగులు లేని సమయంలో మహేష్ బాబు పూర్తిగా తన పిల్లలతోనే గుడపుతుంటారు.

విదేశాల్లో గడుపుతుంటారు
మహేష్ బాబు లాంటి సెలబ్రిటీలు ఇండియాలో బయట తిరిగి ఎంజాయ్ చేయడం చాలా కష్టం. అందుకే వీలు దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు చెక్కేస్తుంటారు మహేష్ బాబు.


Click it and Unblock the Notifications











