గుంటూరు కారం మూవీపై సితార షాకింగ్ రియాక్షన్.. బాలేదని ఇండైరెక్టుగా చెప్పేసిందా?
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తాజా వచ్చిన సినిమా గుంటూరు కారం గురించి అందరికీ తెలిసిందే. అతడు, ఖలేజా తర్వాత దాదాపు పదమూడు సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా జనవరి 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. అయితే దీనికి మొదటి రోజు డీసెంట్ టాక్ రాగా.. అందుకు తగ్గట్లుగానే పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఈ చిత్రాన్ని చూసేందుకు చాలా మందే ఆసక్తి కనబరుస్తున్నారు.
ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమకు నచ్చినట్లుగా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఎక్స్ వేధికగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తుండగా.. తాజాగా ఈ సినిమాపై మహేష్ బాబు కూతురు.. గారాల పట్టిన సితార పాప స్పందించింది. తండ్రి హీరోగా చేసిన ఈ సినిమా చూసిన సితార ఘట్టమనేని.. ఎవరూ ఊహించని విధమైన రెస్పాన్స్ ఇచ్చింది. అది చూసిన నెటిజెన్లు అంతా సినిమా బాలేదని ఇండైరెక్ట్ గా చెప్పినట్లు భావిస్తున్నారు. అయితే ఈమె ఎలా రెప్సాండ్ అయింది అంతా ఆమెకు తండ్రి సినిమా నచ్చలేదని ఎందుకు అనుకుంటున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధా కృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యూట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా చేసింది. అలాగే జగపతి బాబు, మీనాక్షి చౌదరి, రమ్య కృష్మ, ప్రకాష్ రాజ్, జయరామ్, ఈశ్వరీ రావు, రావు రమేష్, మురీళీ శర్మ, సునీల్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, మధుసూధన్ రావు, అజయ్ ఘోష్, మహేష్ ఆచంట, రఘు బాబులు కీలక పాత్రల్లో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించారు. అలాగే నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన ఈ సినిమాకు బాక్సాఫీసును షేక్ చేస్తోంది. పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టుకుంటూ రచ్చ చేస్తున్న ఈ సినిమాను సుదర్శన్ థియేటర్ లో జనవరి 12వ తేదీన చూశారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు కలిసి చూశారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని చూసింది. ఈక్రమంలోనే ఇన్ స్టాగ్రామ్ వేధికగా రెస్పాండ్ అయింది. వెన్నెల కిషోర్ అదో రకమైన ఎక్స్ ప్రెషన్ పెడుతూ ఉన్న ఫొటోను పెట్టి మరీ రియాక్ట్ అయింది. అయితే వెన్నెల కిషోర్ రియాక్షన్ చూస్తుంటే సినిమా నచ్చినట్లు అనిపించట్లేదని అనిపిస్తోంది.
అలాగే కారం ఘాటు ఎక్కువ అవడంతో అలా పెట్టినట్లు కూడా కనిపిస్తోంది. కానీ దీనిపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఆమెకు సినిమా నచ్చిందని కొందరు, నచ్చలేదని కొందరు అంటున్నారు. దీనిపై మరోసారి సితార స్పందిస్తే తప్ప అసలు విషయం తెలిసేలా లేదు. చూడాలి మరి పాప రియాక్ట్ అవుతుందా లేదా అనేది.


Click it and Unblock the Notifications











