మహేష్ బాబు!...ఏంటో ఈ అయోమయం?
హైదరాబాద్: మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో '1'(నేనొక్కడినే) చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈచిత్రం షూటింగ్ కూడా పూర్తయింది. అయితే ఓ సాంగు చిత్రీకరణ ఇంకా పెండిగులో ఉంది. ముంబైలో ఇందుకు సంబంధించిన షూటింగ్ జరుగాల్సి ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ ఆపేసి...ప్రస్తుతం మహేష్ బాబు తన తర్వాతి సినిమా 'ఆగడు' షూటింగులో పాల్గొంటున్నారు. ఆ మిగిలిన సాంగ్ షూటింగ్ డిసెంబర్ రెండో వారంలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న 'ఆగడు' చిత్రం షూటింగ్ నవంబర్ 28న మొదలైంది. మహేష్ బాబు-శ్రీను వైట్ల కాంబినేషన్లో ఇది రెండో సినిమా. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '1'(నేనొక్కడినే), శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆగడు' చిత్రాన్ని ఒకే సంస్థ నిర్మిస్తోంది. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాలను నిర్మిస్తున్నారు.
అయితే '1' షూటింగ్ పూర్తి కాకుండా 'ఆగడు' షూటింగ్ ఎందుకు మొదలు పెట్టారనే దానిపై సరైన సమాచారం అందలేదు. అయితే రెండు సినిమాలు ఒకే నిర్మాణ సంస్థకు చెందినవి కాబట్టి అడ్జెస్ట్‌మెంట్లో భాగంగానే ఇలా చేసినట్లు స్పష్టమవుతోంది. గతంలో మహేష్ బాబుతో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించి భారీ లాభాలను ఆర్జించిన 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ ఇపుడు వరుస పెట్టి ఆయనతో రెండు సినిమాలు తీయడం వెనక రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
మహేష్ బాబుకు వీరు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో పాటు, సినిమా నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగస్వామిగా తీసుకున్నారని......అటు రెమ్యూనరేషన్‌తో పాటు ఇటు లాభాల్లో వాటా కూడా దక్కే విధంగా డీల్ ఉండటంతో మహేష్ బాబు ఈ నిర్మాణ సంస్థతో వరుస సినిమాలు చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications












