మహేష్ బాబు కి అలాంటివే కావాలా?
స్క్రిప్టు మీద ఎక్కువ శ్రధ్ద పెట్ట హీరోల్లో మహేష్ బాబు ఒకరనే సంగతి తెలిసిందే. అయితే ఆయన కూడా తాజాగా మిగతా హీరోల్లా కామిడినే సినిమాను పూర్తి స్ధాయిలో నిలబెడుతుందనే అభిప్రాయానికి వచ్చారు. ఈ ప్రత్యేక విషయాన్ని తన సన్నిహితులు వద్ద ప్రస్ధావించారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఏ సినిమాకైనా విజయం అనేది కామిడి ఏ రేంజిలో పండుతుందనే దాని మీద ఆధారపడి ఉంటోంది. మిగతా ఎలిమెంట్స్ అన్నీ దాని వెనకే ఉంటున్నాయి. అందుకే కామిడీ స్ట్రాంగ్ గా ఉండి రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న పాకెడ్ స్క్రిప్టు చాలు. అలాంటివే ఓకే చేయాలనుకుంటున్నాను. అలాగే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న త్రివిక్రమ్ స్క్రిప్టు కూడా కామిడీ స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నారు. అందుకేనేమో నెక్ట్స్ శ్రీనువైట్ల సినిమా కమిటయ్యాడు.గతంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు కూడా కామిడీ బలం ఉన్న స్క్రిప్టే.


Click it and Unblock the Notifications











