'24' సినిమా ఎందుకు వదలుకున్నారు? ఇదీ మహేష్ బాబు జవాబు!

By Bojja Kumar

హైదరాబాద్: సూర్య హీరోగా తెరకెక్కిన '24' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు విజయ్ కె. కుమార్ ఈ కథను సూర్య కంటే ముందు మహేష్ బాబుకే వినిపించారు. అయితే మహేష్ బాబు నుండి గ్రీన్ సిగ్నల్ రాక పోవడంతో సూర్యతో ఈ సినిమా చేసారు.

దీనిపై బయట రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబే ఈ సినిమాను సూర్యకు అయితే బాగా సూటవుతుందని రికమండ్ చేసారనే ఓ ప్రచారం కూడా ఉంది. తాజాగా బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన ప్రశ్నలకు మహేష్ బాబు సమాధానం ఇచ్చారు.

'సూర్యకు ఈ సినిమా సూటవుతుందని నేను సలహా ఇచ్చాననే ప్రచారంలో నిజం లేదు. నేనేం సలహా ఇవ్వలేదు. కొన్ని కథలు తమకు తగ్గ వ్యక్తుల్ని వెదుక్కొంటూ వెళ్తాయి. అలా '24' సూర్యని వెదుక్కొంటూ వెళ్లింది' అని మహేష్ బాబు తెలిపారు.

 Mahesh Babu Did Not Recommend Suriya For 24

24 కథ వికమ్ కుమార్ చెప్పినపుడు నాకు బాగా నచ్చింది. కానీ కథ చెబుతున్నప్పుడు నన్ను నేను తెరపై చూసుకోలేకపోయా. మొన్నే '24' సినిమా చూశా. సూర్య మాత్రమే ఆ కథ చేయగలరు అనిపించింది అని మహేష్ బాబు అన్నారు.

ప్రేక్షకులు రోజురోజుకీ మారుతున్నారు. వాళ్లకు ఏదైనా సరే కొత్తగా చెప్పాలి. అందుకే ఫ్రెష్‌ సినిమాలొస్తున్నాయి. మరీ సినిమాటిక్‌గా ఉన్న సన్నివేశాల్ని అస్సలు చూడడం లేదు. బీ, సీ సెంటర్లతోపాటు, మల్టీప్లెక్స్‌ ప్రేక్షకులకు నచ్చేలా కథల్ని ఎంచుకొంటే అద్భుతాలు సృష్టించొచ్చు. 'బాహుబలి', 'శ్రీమంతుడు' చిత్రాలే అందుకు ఉదాహరణ అని మహేష్ బాబు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X