మహేష్ బాబుకు సలహా: బావ గల్లా జైదేవ్‌పై సినిమా!
హైదరాబాద్: రొటీన్ పాత్రలు కాకుండా చేసే ప్రతి సినిమా డిఫరెంటుగా ఉండాలని, మంచి గుర్తింపు తేచ్చే విధంగా తన క్యారెక్టర్ ఉండాలని మహేష్ బాబు భావిస్తుంటారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల క్యారెక్టర్లన్నీ దాదాపుగా అలానే ఉంటాయి. అందుకే ఒక సినిమా ఒప్పుకునే ముందు చాలా సమయం తీసుకుంటారాయన.
మహేష్ బాబు వెల్ విషర్స్, అభిమానులు కూడా ఆయన ప్రతి సినిమా డిఫరెంటుగా ఉండాలని కోరుకుంటారు. తాజాగా కొందరు మహేష్ బాబుకు సరికొత్త సలహా ఇస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా ఎన్నికైన మహేష్ బాబు బావ గల్లా జైదేవ్ జీవితంపై సినిమా తీస్తే డిఫరెంటుగా ఉంటుందని అంటున్నారు.

గల్లా జైదేవ్ వందల కోట్ల ఆస్తులతో దేశంలోని ధనవంతులైన ఎంపీల్లో ఒకరిగా ఉన్నారు. బిజినెస్‌మేన్‌గా ఆయనకు మంచి పేరుంది. గతంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'బిజినెస్ మేన్'చిత్రంలో కొన్ని నెగెటివ్ అంశాలు ఉండటంతో సినిమా ఆశించిన ఫలితాలు రాలేదు. గల్లా జైదేవ్ జీవితం ఆధారంగా మహేష్ బాబు హీరోగా పాజిటివ్ అంశాలతో 'బిజినెస్ మేన్' చిత్రానికి సీక్వెల్ తీస్తే అదిరిపోతుందని... సొసైటీపై, ఆడియన్స్‌పై మంచి ఇంపాక్ట్ పడుతుందని అంటున్నారు. మరి మహేష్ బాబు ఈ దిశగా ఏమైనా ఆలోచన ఏస్తారా? లేదా? చూడాలి.
ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు'చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. దసరా నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











