రీమేక్ ఇష్టపడని ‘ఒక్కడు’: మహేష్ బాబు!
టాలీవుడ్ హీరోల్లో రీమేక్ సినిమాలు చేయడానికి ఇష్టపడని హీరో మహేష్ బాబు నిజానికి తన కెరీర్ లో ఇప్పటి వరకూ ఒక్క రీమేక్ కూడా చేయని హీరో ఎవరన్నా ఉన్నాడా అంటే అది మహేష్ బాబు 'ఒక్కడు" మాత్రమే. నేను రీమేక్ సినిమాలు అస్సలు చేయను అంటున్నాడు మహేష్. అపారమైన ప్రతిభ, పాటవం కల నటులు కమల్ హాసన్, అమీర్ ఖాన్ లాంటి వారే రీమేక్ సినిమాలు చేస్తుంటే మహేష్ బాబు ఎందుకు ఆ దిశగా కనీసం ఆలోచించట్లేదు అన్న సందేహం సహజంగానే అందరికీ వస్తుంది.
ఇదే విషయమై మహేష్ బాబు 'ట్విట్టర్" లో ఎవరో చేసి వదిలేసిన సబ్జెక్ట్ ని పట్టుకుని రీమేక్ చేస్తే మజా ఏం ఉంటుంది? ఒరిజినల్ సినిమా చేస్తేనే అసలు థ్రిల్లంతా అని రాసుకున్నాడు. మహేస్ రీమేక్ సినిమాలు చేయకపోయినా, తాను నటించిన చాలా సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవుతుండటం గురించి మహేష్ గర్వంగా చెప్పుకుంటాడు.
ప్రస్తుతం మహేహే బాబు వరుస సినిమాలతో బిజీబిజీగా తన ప్రాజెంక్ట్స్ ను ముగిస్తూ, ఒక్క త్రివిక్రమ్ సినిమాతోనే కాకుండా అటు శ్రీను వైట్ల, ఇటు సుకుమార్ దర్శకత్వంలో చేయుటకు 'అతడు" కి తగ్గట్టు స్ర్కిప్ట్ లను ఎంపిక చేసే విధానంలో సమయాన్ని వేస్ట్ చేయకుండా రాబోవు సంవత్సరంలో మొదటి ఆరు నెలలు సూపర్ హిట్స్ అందించే దిశగా దూసుకొస్తున్నాడు.


Click it and Unblock the Notifications











