»   »  చెన్నై వరదలు: మహేష్ బాబు సాయం ఎంతంటే...

చెన్నై వరదలు: మహేష్ బాబు సాయం ఎంతంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవలి కాలంలో చెన్నై నగరం వరదల తాకిడికి గురై జనజీవనం అస్తవ్యస్తమైన నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చెన్నై వరద బాధిుతలకు రూ. 10 లక్షల సహాయం ప్రకటించారు. తమిళనాడు సి.ఎం.రిలీజ్ ఫండ్ కి ఈ విరాళాన్ని అందజేస్తారు.

మహేష్ బాబు మాట్లాడుతూ...భారీ వర్షాలు, వరదల వల్ల ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్న చెన్నై ప్రజానీకం ఈ విపత్కర పరిస్తితి నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నా వంతు సహాయంగా రూ. 10 లక్షలు సిఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నాను అన్నారు.

ప్రస్తుతం చెన్నై నగరం లో ఉన్న పరిస్థితులకు స్పందిస్తూ, యువ నటుడు వరుణ్ తేజ్ తన వంతు సహాయం గా 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నట్లు గా అయన తెలిపారు.

 Mahesh Babu donates 10L towards Chennai Flood Relief

"చెన్నై నేను పుట్టిన నగరం. అటువంటి చెన్నై నేడు ఇలా వరద నీట మునగటం నన్ను ఎంతగానో కలచివేసింది. నా వంతు సహాయం గా నేను 3 లక్షల రూపాయలను CM రిలీఫ్ ఫండ్ కి పంపిస్తున్నాను. అందరూ తమకు తోచినంత సహాయం చేయవలసింది గా కోరుతున్నాను", అని అన్నారు.

వీరితో పాటు జూ ఎన్టీఆర్ రూ. 10 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ. 5 లక్షలు, రవితేజ రూ. 5 లక్షలు, సంపూర్ణేష్ బాబు రూ. 50 వేల సహాయం ప్రకటించారు.

English summary
Tollywood super star Mahesh Babu donates 10L towards Chennai Flood Relief.
Please Wait while comments are loading...