»   » దూకుడు గురించి మహేష్ ట్విట్టర్ లో...

దూకుడు గురించి మహేష్ ట్విట్టర్ లో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన తాజా చిత్రం దూకుడు గురించి మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత ట్వీట్ చేసారు. ఆయన మాటల్లోనే.. మా డైరక్టర్ మాటల ప్రకారం దూకుడు ఫస్టాఫ్ ఆర్.ఆర్ అవుట్ స్టాండింగ్. తమన్ కే ఈ ప్రశంసలు అన్నీ దక్కుతాయి. ధాంక్యూ తమన్.సెకెండాఫ్ కూడా ఇంతకన్నా బాగా చేస్తాడని ఆసిస్తున్నాను.నా వరకూ చెప్పాలంటే నేను గ్రేట్ వర్క్ చేస్తున్న ఫీలింగ్ లో ఉన్నాను. పని..పని..పని అన్నట్లుంది అన్నారు. మహేష్ ఇలా ట్విట్టర్ ద్వారా తన టీమ్ లో ఉత్సాహాన్ని నింపటం చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది. హీరో ఇచ్చే ఈ ఇన్సిప్రేషన్ తాము చేస్తున్న వర్క్ ని మరింత బాగా చేయటానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అంతేగాక బయిట దూకుడు గురించి అభిమానుల్లో, డిస్ట్రిబ్యూటర్స్ లో కూడా పాజిటివ్ అంచనాలు పెరగటానికి ఈ విధమైన ప్రోత్సాహం బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.

English summary
Mahesh Babu tweets ---Jus hada word with my director....according to him the 1st half rr is outstanding:)all praise 4 thamann.Thanx thamann:)hope d 2nd half is even better As 4me I'm doin gr8:)work work work all d way....goodnight.....god bless.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu