మహేష్ చెప్పినట్లే ఈ రోజు పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్...!
ఈ రోజుల్లో తెలుగు సినిమాలు ఎంత ప్రచారం చేసుకొన్నా రెండు మూడు వారాలు కన్నా ఎక్కువ ఆడటం కష్టమయి పోతోంది. ఎందుకంటే కారణాలు కొల్లలు. కర్ణుడి చావుకి వేయి కారణాలన్నట్లు సినిమా కధ మొదలుకొని, పెరిగిన సినిమా టికెట్ల దరలవరకు చాంతాడంత లిస్టుంది. ఈ బాలారిష్టాలన్నీ దాటుకొని ఒక సినిమా 50 రోజుల పూర్తి చేసుకొందంటే, ఈ రోజుల్లో అది నిజంగా గొప్ప విషయమే. ఇప్పుడు మహేష్ బాబు 'దూకుడు' సినిమా కూడా మంచి దూకుడు మీద వెళ్తూ నిన్నటికి 237 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకొంది.
అందుకే, ఈ రోజు ఆ సినిమాకి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజిలో సాయంత్రం '50 రోజుల పండుగ' ఘనంగా చేసుకోవాలని ఆ సినిమా నిర్మాతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాతలు గోపి, అనిల్ మరియు రామ్ మొదలయిన వారందరూ రాబోతున్నారు. మహేష్ బాబు తల్లి తండ్రులు సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిలుగా వస్తున్నారు. వీరేగాక, తెలుగు సినీ పరిశ్రమకి చెందినా అతి రాధా మహారధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్న ఈ ఫంక్షన్ ని మా టి.వి సాయంత్రం 7.30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మరొక విశేషం ఏమిటంటే దూకుడు వేడుకలోకి ఎంట్రీ ఫ్రీ కాబట్టి ఈ ఫంక్షన్ కూడా సూపర్ హిట్.
ఇదే కార్యక్రమంలో మహేష్ బాబు తరువాత సినిమా 'బిజినెస్ మ్యాన్' ఫస్ట్-లుక్ పోస్టర్లు కూడా రిలీజు చేయబడతాయి. అలాగే పనిలో పనిగా నెక్స్ట్ మహేష్-సుకుమార్ ల కాంబినేషన్ లో తర్వతో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన వివరాలు కూడా అధికారికంగా ప్రకటన ఈ ఫంక్షన్ లో వెలువడనుందని తెలిసింది. డిసెంబర్ లో లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి మూడవ వారంలో ప్రారంభం కానుందట.


Click it and Unblock the Notifications











