మహేష్ ‘దూకుడు’గా ట్విట్టర్లోకి వచ్చాడు..!
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సమంత హీరోయిన్ గా 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మాతలుగా శ్రీనూవైట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'దూకుడు" ఈ చిత్రం ప్రస్తుతం పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకొంటుంది. ఇటీవల హైదరాబాదులో గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ ఎత్తున మహేష్ బాబు పై కొన్ని పోరాట సన్నివేశాలని తెరకెక్కించారు . విడుదలకు ముందు సినిమా గురించి ఎక్కువగా ఎప్పుడూ ప్రస్తావించని మహేష్ ఈ దూకుడు చిత్ర విషయంలో మాత్రం తన మనసు దూకుడు కి కళ్ళెం వేయలేక పోయాడు.
తాజాగా ట్విట్టర్లో ప్రస్తావిస్తూ 'దూకుడు" విడుదలకోసం నేను కూడా ఆతృతతో ఎదురుచూస్తున్నాను. నిర్మాతల మేకింగ్ స్టైల్ నాకెంతో నచ్చింది. నేను ఇప్పటి వరకూ పనిచేసిన ప్రొడక్షన్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్ ఇది 'అంటూ తన అభిప్రాయాన్ని పోస్ట్ చేసారు. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్స్ విడుదలయ్యాయి. ఈ సినిమా విడుదల కొసం మహేష్ అభిమానులేకాక తెలుగు ప్రేక్షకులందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని నిజం. తమన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలువనుంది. ప్రస్తుతం ఈ చిత్రంలోని పతాక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఆడియోను ఆగష్టు మొదటి వారంలో విడుదల చేస్తారు. ఆ నెలాఖరుకి సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ జరుగుతోంది. ఈ చిత్ర నిర్మాతలు తెలిపారు.


Click it and Unblock the Notifications











