వేలంలో మహేష్ బాబు, సమంత డ్రెస్సులు
మహేష్ బాబు, సమంత నటించిన తాజా సినిమా దూకుడు. ఈ సినిమా సూపర్ హిట్ కలెక్షన్లతో ఈ సీజన్ లో బిగ్గెట్ హిట్ గా తూసుకెలుతూ...పాత రికార్డులను బద్దలు కొట్టేందుకు రెడీ అవుతోంది. కాగా...ఈ చిత్రంలో మహేష్ బాబు, సమంత ధరించిన కాస్ట్యూమ్స్ ను వేలం వేసేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ నెల 25లోగా ఎవరు ఎక్కువ మొత్తం బిడ్ వేస్తే వారికి వాటిని అందజేస్తామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్ వెల్లడించారు. ఈ వేళం ద్వారా వచ్చిన మొత్తాన్ని మా సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తామని చెప్పారు. ఓ మంచి కార్యక్రమం కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి విజయవంతం అవుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు శ్రీనువైట్ల అన్నారు.


Click it and Unblock the Notifications











