»   » 'నీ దూకుడు..సాటి ఎవడు?' అంటున్న మహేష్

'నీ దూకుడు..సాటి ఎవడు?' అంటున్న మహేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నీ దూకుడు...సాటి ఎవడు అంటూ మహేష్ బాబు తాజా చిత్రం దూకుడు కోసం ఓ పాటని రికార్డింగ్ చేసారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం కోసం ఈ పాటని రికార్డు చేసారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ మూడవ తేదీన గుజరాత్ లో ప్రారంభం కానుంది. మహేష్, సమంతల మీద ఈ పాటని చిత్రీకరించటంతో సినిమా ప్రారంభమవుతుంది. ఇక ఈ పాటకి లొకేషన్ గా గుజరాత్, అలాంగ్ లోని ఎంపిక చేసారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని 14 రీల్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించనున్నారు. శ్రీను వైట్ల తన పొటిన్షియల్ మొత్తం వినియోగించి మంచి చిత్రాన్ని రూపొందిస్తానని చెప్తున్నారు. ఈ చిత్రంలో మేజర్ పార్టు నార్త్ ఇండియాలో షూటింగ్ జరుగుతుంది. శ్రీను వైట్ల తన కెరీర్ లో మొదటి సారిగా సూపర్ 35 ఎం.ఎం కెమెరాను ఈ చిత్రం కోసం వినియోగిస్తున్నాడు. టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ తో ఈ చిత్రం రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ చిత్రంలో మహేష్..పోలీస్ ఆఫీసరు పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu