మహేష్ బాబు పెళ్లి బట్టలు ఆక్షన్ ..
మహేష్ బాబు తాజా చిత్రం దూకుడులో చివరి పాటలో పెళ్లి డ్రస్ లో కనపడతాడు. ఆ మ్యారేజ్ డ్రస్ ని ఆక్షన్ కి పెడుతున్నారు.మా అశోశియేషన్ కి చెందిన వెబ్ సైట్ ద్వారా ఆ ఆక్షన్ జరగనుంది.వారు గతంలో కూడా హిట్టైన చిత్రాలలో ని డ్రస్ లను,ఆయుధాలను ఆక్షన్ కి పెట్టి వాటి ద్వారా వచ్చిన డబ్బుని సద్వినియోగం చేయటం జరుగుతోంది.పేద సినీ కళాకారలుకు ఆ డబ్బుని అందివ్వటం జరుగుతోంది.అదే వరసలో దూకుడు నిర్మాతలను కూడా ఈ విషయమై చెప్పి ఒప్పించి ఆ బట్టలను ఆక్షన్ కి ఉంచారు.అలాగే ఈ పాటలో నటించిన సమంత చీరను కూడా ఆక్షన్ పెడతారు.దీనికి మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇక ఈ పాటలో శర్వాని,కుర్తా ఉపయోగించారు.అలాగే సమంత ..హాఫ్ శారి వాడింది.దీనితో మహేష్ అభిమానులు ఆనందోత్సాహం ప్రకటిస్తున్నారు.వారు కూడా ఆ ఆక్షన్ లో పాల్గొనటానికి ఆసక్తి చూపుతున్నారు.ఇక ఆక్షన్ లో గెలుచుకున్న అభిమానికి మహేష్ బాబు స్వయంగా ఆ బట్టలను అందచేస్తారు.అది అభిమానులను ఆనందపరిచే అంశం.ఆక్షన్ ప్రారంభమైంది కాబట్టి అభిమానులు ఉత్సాహంగా పాల్గొనాలని విజ్ఠప్తి చేస్తున్నారు.ఇక మహేష్ దూకుడు రీసెంట్ గా యాబై రోజుల పండుగ విజయవాడలో జరిగింది.అక్కడ అభిమాలనులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.మరో ప్రక్క మహేష్ అభిమానులు తమ చిత్రం దూకుడు రికార్డులపై మెగాభిమానులు చేస్తున్న ఛాలెంజ్ లకు కౌంటర్స్ ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











