ముంబాయ్ లో మొదలైన మహేష్ 'దూకుడు'...
మహేష్ యమ 'దూకుడు' గా విజయం కోసం శరవేగంగా సిద్దం అవుతున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న దూకుడు సినిమా మార్చి22 నుండి ముంబాయ్ లో షూటింగ్ జరుపుకోనుంది. మార్చి19 వరుకు హైదరాబాద్ లో జరిగిన షెడ్యూల్ లో ఒక పాట, కొంత టాకీ పార్ట్ పూర్తి చేసారు. ఇప్పటికే ఈ సినిమా 60%పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాను జూన్ లో విడుదల చేయటానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
మహేష్ తో సమంతా జోడి కడుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతకం ఫై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. తమన్ తోలి సారి మహేష్ సినిమాకు పాటలు అందిస్తున్నాడు. దూకుడు గతంలో టర్కీ, గుజరాత్ లలో షూటింగ్ జరుపుకుంది. మహేష్ పోలీసు ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ ప్రొడక్షన్స్ సమర్పిస్తుంది.


Click it and Unblock the Notifications











