Maha Shivaratriకి మహేశ్ బాబు 2 సినిమాలు.. పవన్ కల్యాణ్ ఆ మూవీ రీ రిలీజ్.. ఎక్కడో తెలుసా?
ఇటీవల రీ రిలీజ్ ట్రెండ్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరోల సూపర్ హిట్ సినిమాలను ఒక స్పెషల్ డే రోజున థియేటర్లలో మళ్లీ ప్రదర్శిస్తున్నారు. ఇక ఏ పండుగకు లేని విధంగా మహా శివరాత్రికి స్టార్ హీరోల సినిమాలను థియేటర్లలో మళ్లీ ప్రదర్శిస్తారు. మహా శివరాత్రికి భక్తులంతా రాత్రి పూట జాగరం ఉంటారన్న విషయం తెలిసిందే. అలా జాగరంలో భాగంగా సినిమాలను ఎక్కువగా ప్రేమించే శివ భక్తులు ఇలా థియేటర్లలోకి వెళ్లి తమ అభిమాన హీరోల సినిమాలను వీక్షిస్తారు. అలాంటి అభిమానుల కోసం థియేటర్ యాజమాన్యం సినిమాలను విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న మహా శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ లో ఏ హీరో సినిమా? ఏ థియేటర్ లో? ఎప్పుడు ప్రదర్శిస్తారనే వివరాల్లోకి వెళితే..

దూకుడు
సూపర్ స్టార్ మహేశ్ బాబు, కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల మొదటి కాంబినేషన్ గా వచ్చిన చిత్రం దూకుడు. మహేశ్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఈ చిత్రం మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18న హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్ లో ఉదయం 3 గంటలకు షో వేయనున్నారు.

సరిలేరు నీకెవ్వరు..
ఈతరం కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆర్మీ సోల్జర్ గా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అలరించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ కొట్టిన సరిలేరు నీకెవ్వరు సినిమాను శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 18 రోజున మహాలక్ష్మీ కాంప్లెక్సులో రాత్రి 11.59 గంటలకు ప్రదర్శించనున్నారు.

భీమ్లా నాయక్
మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యనుమ్ కోషీయమ్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రం భీమ్లా నాయక్. సితారం ఎంటర్టైన్ మెంట్స్ పై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వ వహించారు. డానియల్ శేఖర్ గా దగ్గుబాటి రానా ఆకట్టుకున్న భీమ్లా నాయక్ సినిమా మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18 అంటే శనివారం నాడు హైదరాబాద్ లోని మహాలక్ష్మీ కాంప్లెక్సులో ఉదయం 3 గంటలకు స్క్రీనింగ్ చేయనున్నారు.

పుష్ప: ది రైజ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ పుష్ప. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా శ్రీవల్లిగా అలరించిన ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని మహా శివరాత్రి రోజును పురస్కరించుకుని ఫిబ్రవరి 18న హైదరాబాద్ లోని సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్ లో ఉదయం 3 గంటలకు, శ్రీకృష్ణ థియేటర్ లో రాత్రి 11.45 గంటలకు, మహాలక్ష్మీ కాంప్లెక్స్ లో రాత్రి 11.59 గంటలకు ప్రదర్శించనున్నారు.

ధమాకా
మాస్ మహరాజా రవితే డబుల్ ధమాకా అందించిన చిత్రం ధమాకా. క్రాక్ వంటి సూపర్ హిట్ తర్వాత, ఖిలాడీ, రామారావ్ ఆన్ డ్యూటి వంటి ఫ్లాప్ ల తర్వాత ఈ సినిమాతో రవితేజ హిట్ అందుకున్నాడు. త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల తన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేసింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న సంపూర్ణ 70 ఎమ్ఎమ్ థియేటర్ లో రాత్రి 11.59 గంటలకు షో వేయనున్నారు.

ఇంకా ఏ చిత్రాలు అంటే..
ఈ చిత్రాలే కాకుండా చిరంజీవి వాల్తేరు వీరయ్య సంధ్య 70 ఎమ్ఎమ్ లో అర్థ రాత్రి 12.15 నిమిషాలకు, అలాగే ఉదయం 3 గంటలకు ప్రదర్శించనున్నారు. బాలకృష్ణ అఖండ చిత్రాన్ని సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్ లోఅర్ధ రాత్రి 12.15 గంటలకు, సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్ లో రాత్రి 11.49 గంటలకు స్క్రీనింగ్ చేయనున్నారు. కాంతార చిత్రాన్ని సప్తగిరి 70 ఎమ్ఎమ్ థియేటర్ లో అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 3 గంటలకు.. జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ మూవీని దేవి 70 ఎమ్ఎమ్ లో అర్థరాత్రి 12.15 గంటలకు, సంధ్య 35 ఎమ్ఎమ్ లో అర్థరాత్రి 12.30 గంటలకు.. ప్రభాస్ రెబల్ సినిమాను సంధ్య 35 ఎమ్ఎమ్ లో ఉదయం 3 గంటలకు మహా శివరాత్రి సందర్భంగా ప్రదర్శించనున్నారు.


Click it and Unblock the Notifications











