తనయుడి పుట్టిన రోజుకి మహేష్ 'దూకుడు' రిలీజ్
గతంలో ఉన్న వార్తల ప్రకారం ఈ సినిమా ఆగష్టు 12న విడుదల కావాలి, కాని సినిమా క్వాలిటి ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాంతర కార్యక్రమాలకు మరింత సమయం కేటాయించాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. దాంతో 'దూకుడు' సినిమా విడుదల ఓ కొలిక్కి వచ్చింది. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మీద మహేష్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు.
అభిమానులంతా ఎంతో క్యూరియాజిటీతో ఎదురుచూస్తున్నశ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు 'దూకుడు' సినిమా పాటలు అతని బర్త్ డే (ఆగష్టు 9) రోజున కాకుండా, కాస్త ముందుగా అంటే ఆగష్టు 6న రిలీజ్ అవుతున్నాయి. అలాగే, సినిమాని అదే నెల 26న విడుదల చేస్తున్నారు. ఆ రోజుకి మాత్రం ఓ ప్రత్యేకత వుంది. మహేష్ తనయుడు గౌతమ్ బర్త్ డే ఆగష్టు 26 కావడం గమనార్హం!
అలా తనయుడి బర్త్ డే రోజున తండ్రి సినిమా రిలీజ్ కావడం ఓ విశేషంగానే చెప్పుకోవాలి. ఈ సినిమా ఫస్ట్ లుక్ మే 31న మహేష్ తండ్రి, హీరో కృష్ణ జన్మదినం నాడు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సమంతా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగు తుది దశకు చేరుకుంది. హైదరాబాదులోని పలు లొకేషన్లలో షూటింగ్ చేస్తున్నారు. శ్రీను వైట్ల డైరెక్షన్లో ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. తమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన దూకుడు పాటలు అద్భుతంగా వచ్చాయని చిత్ర యూనిట్ వర్గాల తెలిపాయి. ఈ సినిమాలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది.


Click it and Unblock the Notifications











