మహేష్ సూపర్ హిట్ మలయాళ డబ్బింగ్

By Srikanya

హైదరాబాద్ : మహేష్ బాబు 'దూకుడు'చిత్రం వరస ప్లాపుల్లో ఉన్న మహేష్ ని నిలబెట్టి రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళం, మళయాళం కూడా అదే రోజు విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు దర్శక నిర్మాతలు. అయితే ఆ రెండు రాష్ట్రాల్లో అప్టట్లో ఆ సినిమా విడుదల సాధ్యం కాక వదిలేసారు. ఇన్నాళ్లకు ఆ చిత్రాన్ని మళయాళంలో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత అనీల్ సుంకర ఖరారు చేసారు.

ఈ విషయమై అనీల్ సుంకర ట్వీట్ చేస్తూ...దూకుడు మలయాళం వెర్షన్ పాటలు రాకింగ్ . డబ్బింగ్ వర్క్ పూర్తి కావొచ్చింది. ప్రిన్స్ తన సామ్రాజ్యాన్ని పెంచుకునే సమయం కోసం ఎదురుచూస్తున్నాము అని ట్వీట్ చేసారు. ''దూకుడు నా సినీ జీవితంలో ప్రత్యేకమైన చిత్రం. ఈమధ్య టీవీలో వస్తుంటే మళ్లీ చూశా. అప్పుడు కూడా ప్రతి సన్నివేశం ఆస్వాదించాను''అన్నారు మహేష్‌బాబు. ఆయన నటించిన 'దూకుడు' చిత్రానికిగానూ ఆయన ఉత్తమ నటుడిగా 'మా సినిమా అవార్డు', ఫిల్మ్ ఫేర్ అవార్డులు సైతం అందుకొన్నారు. ఇక ఈ చిత్రం మళయాళంలో హిట్ అయితే ఆయన సినిమాలన్నీ వరసగా మళయాళంలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు...వెంకటేష్ తో దిల్ రాజు నిర్మిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ..''నిర్మాతగా నా కెరీర్‌లోనే మరిచిపోలేని సినిమా ఇది. వెంకటేష్, మహేష్ లాంటి టాప్ స్టార్స్‌తో మల్టీస్టారర్ మూవీ చేయడం గొప్ప అనుభూతి. భావోద్వేగాల సమ్మేళనం ఈ సినిమా. కచ్చితంగా ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుంది'' అని 'దిల్' రాజు చెప్పారు.

అలాగే మల్టీస్టారర్ చిత్రంగా నిర్మాణమవుతున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, కుటుంబ విలువలు ప్రధానంగా చర్చిస్తున్న ఈ చిత్రం యువతకు, మహిళలకు తప్పక నచ్చుతుందని తెలిపారు. అన్న వెంటే తమ్ముడు కూడా అడవులు పట్టిపోవడానికి ఇది రామాయణం కాదు. తమ్ముడి కోసం రాజ్యాన్ని ధారబోసే అన్నలూ లేరు. ఆస్తితో అడ్డగీత గీస్తే అనుబంధం రెండు ముక్కలైపోతున్న రోజులివి. ఇప్పుడు కూడా అన్నమాట జవదాటని తమ్ముడున్నాడా? తండ్రి ఇచ్చిన మాట కోసం తమ సర్వస్వం ధారబోసే తనయులు కనిపిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మా సినిమా చూడాలి అన్నారు దిల్‌ రాజు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X