మహేష్ సూపర్ హిట్ మలయాళ వెర్షన్ ఈ రోజే
హైదరాబాద్ : మహేష్ బాబు 'దూకుడు'చిత్రం ఇన్నాళ్లకు మళయాళ వెర్షన్ 'చూడన్ ' రిలీజ్ అవుతోంది. ఈ రోజే ఈ చిత్రం మళయాళంలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. వరస ప్లాపుల్లో ఉన్న మహేష్ ని నిలబెట్టి రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళం, మళయాళం కూడా అదే రోజు విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు దర్శక నిర్మాతలు.
అయితే ఆ రెండు రాష్ట్రాల్లో అప్టట్లో ఆ సినిమా విడుదల సాధ్యం కాక వదిలేసారు. ఇన్నాళ్లకు ఆ చిత్రాన్ని మళయాళంలో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత అనీల్ సుంకర ఖరారు చేసారు.
''దూకుడు నా సినీ జీవితంలో ప్రత్యేకమైన చిత్రం. ఈమధ్య టీవీలో వస్తుంటే మళ్లీ చూశా. అప్పుడు కూడా ప్రతి సన్నివేశం ఆస్వాదించాను''అన్నారు మహేష్‌బాబు.
ఆయన నటించిన 'దూకుడు' చిత్రానికిగానూ ఆయన ఉత్తమ నటుడిగా 'మా సినిమా అవార్డు', ఫిల్మ్ ఫేర్ అవార్డులు సైతం అందుకొన్నారు. ఇక ఈ చిత్రం మళయాళంలో హిట్ అయితే ఆయన సినిమాలన్నీ వరసగా మళయాళంలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు.


Click it and Unblock the Notifications











