»   » హాట్ కేక్ గా మారిన మహేష్ ‘దూకుడు’...!

హాట్ కేక్ గా మారిన మహేష్ ‘దూకుడు’...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రిన్స్ మహేష్‌బాబు, సమంత జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దూకుడు" శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో టాకీపార్ట్‌ షూటింగ్‌ లో ఉంది యూనిట్‌. మరికొద్ది రోజుల్లో అక్కడి చిత్రీకరణ ముగించుకుని తదుపరి పాతబస్తీలో పోరాట సన్నివేశాల చిత్రీకరణకు రంగం సిద్ధం చేస్తోంది. దీని తర్వాత ఈ నెల 20 న యూనిట్ ముంబై షిఫ్ట్ అవుతుంది. అక్కడ కొన్ని ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. అనంతరం ముంబైలోనే ఓ పాటను చిత్రీకరిస్తారు.

ఈ చిత్రం టర్కీ, దుబాయ్, గుజరాత్ లలో కూడా ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకుంది. శ్రీను వైట్ల శైలిని మిస్ కాకుండా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూన్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీచంద్‌ ఆచంట, రామ్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. 'మిరపకాయ్‌", 'రగడ" చిత్రాలతో సక్సెస్‌ ఫుల్‌ సంగీత దర్శకుడిగా దూకుడు మీదున్న తమన్‌ ఈ చిత్రానికి కూడా తన సంగీతం అందిస్తున్నారు.

'హ్యాపీడేస్‌" సోనియా ఓ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం బిజినెస్ వర్గాల్లో హాట్ కేక్ లా వుంది. మహేష్ ఆమధ్య నటించిన 'ఖలేజ" సినిమా ప్లాప్ అయినప్పటికీ, ఈ 'దూకుడు"కి పెద్ద రెస్పాన్స్ వుండడం విశేషం.

English summary
Mahesh Babu is leaving to Turkey tomorrow morning for Krishna Productions Presents ..Dookudu 1st Schedule which is going to start from friday. 
 Few important scenes would be shot there. One of the fight scheduled to be picturised would be mastered by Ram - Lakshman who have given excellent fight composition in Khaleja. 
 A song would be canned in Turkey under the cheriography of Sobhi , the cheriographer of Yamadonga.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu