ఇక మహేష్ కి ‘దూకుడు’తో సంబందం లేదు.....!
శ్రీను వైట్ల కాంబినేషన్ లో ప్రిన్సు మహేష్ బాబు, సమాంత జంటగా నటిస్తున్న చిత్రం 'దూకుడు". అత్యంత భారీ అంచనాలతో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రానికి నేడు గుమ్మడికాయ కొట్టేసారు. తెలుగు సినిమా పరిశ్రమ లో చిత్రం షూటింగ్ పూర్తి అయిన అనంతరం గుమ్మడికాయ కొట్టటం ఆనవాయితి. గుమ్మడికాయ కొడితే ఇక షూటింగ్ మొత్తం అయిపోయినట్లే. 14, 15 న సినిమా ధియేటర్స్, సినిమా షూటింగ్ లు బంద్ కారణంగా మహేష్ ఎలాగైనా అంతలోపు షూటింగ్ కంప్లీట్ చెయ్యాలని రాత్రింబవళ్ళు కష్టపడి షూటింగ్ పూర్తి చేసేసాడు.
ఈ నెల 18న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని 19న తేదీన సెన్సార్ కార్యక్రామలు పూర్తి చేసుకుంటుంది. ఈనెల 22న ప్రీమియర్ షో వేసి...23 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతున్న దూకుడు పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఆడియో విశేష స్పందన అందుకుంది. దూకుడు చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా, తమన్ సంగీత బాణిలను అందించారు.14 రీల్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి మహేష్ బాబు అభిమానులు ఆత్రం గా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











