»   » జూ ఎన్టీఆర్ ని ఫాలోఅవుతున్న మహేష్ బాబు...!

జూ ఎన్టీఆర్ ని ఫాలోఅవుతున్న మహేష్ బాబు...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ హీరోగా శ్రీను వైట్ల రూపొందిస్తున్న దూకుడు సినిమా కొత్త ట్రెయిలర్ లో 'బ్లడ్ "కి సంబంధించిన ఒక డైలాగుంది. సాధారణంగా బ్లడ్, వంశం లాంటి డైలాగులపై పేటెంట్ హక్కులన్నీ నందమూరి వంశ హీరోలవే. ప్రధానంగా ఇలాంటి డైలాగులు పేల్చడానికి ఎన్టీఆర్ ఆసక్తి చూపిస్తుంటాడు. సాఫ్ట్ క్యారెక్టర్లు చేయడానికి ఇష్టపడే మహేష్ బాబు ఇప్పుడు ఈ దూకుడు పేరు చెప్పి ఇంత వయొలెంట్ గా డైలాగులు చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

అంతటితో ఆగకుండా ఈ సినిమా మహేష్ పొలిటిషియన్ వేషంలో కూడా కనిపిస్తున్నాడు. మహేష్ కి మాస్ లో ఫాలోయింగ్ ఉన్నా కానీ ఎన్టీఆర్ కి ఉన్నంత మాస్ ఫాలోయింగ్ అతనికి లేదు. బహుశా దానిని దృష్టిలో ఉంచుకుని వారిని కూడా తనవైపుకి తిప్పుకునేందుకు ఇంత దూకుడు చూపిస్తున్నాడేమో తెలీదు అయితే ఎంత బ్లడ్ గురించి డైలాగ్ చెప్పినా కూడా దానిని కూడా సాప్ట్ గా చెప్పి ఆ డైలాగ్ లోని పంచ్ మిస్సయ్యాడు మహేష్ బాబు.

English summary
Mahesh Babu, Samantha and Srinu Vytla's 'Dookudu’ movie audio release on 13th August at Shilpakala Vedika, Hyderabad. MAA TV play live telecast of 'Dookudu' movie audio function. Producers are planning to release 'Dookudu’ film on 31st August 2011.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu