కృష్ణ నట జీవితంపై మహేష్ బాబు ఎమోషనల్ మెసేజ్.. ఫస్ట్ స్టెప్ అదే అంటూ!
సూపర్ స్టార్ కృష్ణ.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. వెండితెర రారాజుగా కొన్ని వందల సినిమాలు చేసి తారలు గడిచినా తరుగుపోని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరం హీరోల్లో విలక్షణ పాత్రలు పోషించగల ఏకైక హీరో తానే అని రుజువు చేసుకొని సూపర్ స్టార్ అయ్యారు కృష్ణ. తాజాగా ఆయన నట జీవితంపై కొడుకు మహేష్ బాబు ఓ ఎమోషనల్ సందేశం పోస్ట్ చేశారు. ఆ వివరాలేంటో చూద్దామా..

55 ఏళ్ల తేనెమనసులు
ఘట్టమనేని కృష్ణ ‘తేనెమనసులు' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా విడుదలై 55 ఏళ్ళు పూర్తయింది. తెలుగులో మొదటి పూర్తి స్థాయి సాంఫీుక చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ మూవీ. అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చితకా పాత్రలు పోషించినా ‘తేనెమనసులు' సినిమా ద్వారానే ఆయన పూర్తిస్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

మొదటి సినిమానే అలా.. తిరుగులేని హీరో కృష్ణ
ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామాలో రామ్ మోహన్, సంధ్యారాణి, సుకన్య కూడా నటించారు. వీరంతా కూడా ఇదే మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన కృష్ణ.. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఐదు దశాబ్దాలపాటు తిరుగులేని హీరోగా కొనసాగుతూ 350కి సినిమాలు చేసి సత్తా చాటారు.

మహేష్ బాబు పోస్ట్..
ఈ నేపథ్యంలో తాజాగా కృష్ణ తనయుడు మహేష్ బాబు ఆ సినిమా సంగతులను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ సందేశం పోస్ట్ చేశారు. తన ఆల్ టైమ్ ఫేవరేట్, ‘తేనే మనసులు' సినిమానే అన్నారు. ఇది మరిచిపోలేని క్లాసిక్ మూవీ అని చెప్పారు. ఈ బ్లాక్ బస్టర్ సినిమాతోనే సూపర్ స్టార్ కృష్ణ సినీ జర్నీ మొదలైంది అంటూ ఆ సినిమా పోస్టర్ షేర్ చేశారు.
షూటింగ్స్ వాయిదా.. నమ్రతా హంగామా
ఇకపోతే దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ వాయిదా పడటంతో.. ఇంట్లోనే ఉంటూ కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారు మహేష్ బాబు. ఈ మేరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫోటోలు షేర్ చేస్తూ ఆయన భార్య నమ్రతా అభిమానులకు ఖుషీ చేస్తోంది. మహేష్‌కి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











