PRO BA Raju No More: బీఏ రాజు మృతిపై మహేశ్ ఎమోషనల్.. చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నామంటూ!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి సినీ రంగంపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతోంది. దీని కారణంగా ఇప్పటికే ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాతలు తదితరులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇంకా పదుల సంఖ్యలో సెలెబ్రిటీలు ఈ వైరస్‌ బారిన పడి.. ఆస్పత్రుల్లో చికిత్సలు తీసుకుంటున్నారు. మరోవైపు, పలు కారణాలతో చాలా మంది ప్రముఖులు మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ నిర్మాత, పీఆర్‌ఓ, సూపర్ హిట్ మ్యాగజైన్ ఫౌండర్ బీఏ రాజు కన్నుమూశారు.

Recommended Video

BA Raju : Mahesh Babu కి Loyal PRO, Tollywood Encyclopaedia || Filmibeat Telugu
నిర్మాత బీఏ రాజు కన్నుమూత

నిర్మాత బీఏ రాజు కన్నుమూత

చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫిల్మ్ జర్నలిస్టుగా, నిర్మాతగా, పీఆర్‌ఓగా సేవలు అందిస్తోన్న బీఏ రాజు శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా మధుమేహ వ్యాధితో బాధపడుతోన్న ఆయన.. ఈ మధ్య దాని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్నారు. శుక్రవారం రాత్రి షుగర్ హెచ్చుతగ్గుల కారణంగా గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా ప్రాణాలను విడిచారు.

 ట్విట్టర్ ద్వారా తెలిపిన కొడుకు

ట్విట్టర్ ద్వారా తెలిపిన కొడుకు

బీఏ రాజు చనిపోయిన విషయాన్ని ఆయన కుమారుడు శివ శంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఈ మేరకు 'మా తండ్రి గారు బీఏ రాజు గారు డయాబెటిస్ హెచ్చుతగ్గుల కారణంగా గుండెపోటుతో మరణించారని దుఖంతో తెలుపుతున్నాము. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. డాడీ మీరెప్పటికీ 'రాజు'గానే ఉండండి. ఎందుకంటే మీరు మా హృదయాల్లో 'సూపర్ హిట్'' అని పేర్కొన్నాడు.

బీఏ రాజు సినీ నేపథ్యం ఇదే

బీఏ రాజు సినీ నేపథ్యం ఇదే

సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అయిన బీఏ రాజు ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు పీఆర్వోగా పనిచేశారు. సూపర్ హిట్ అనే మ్యాగజైన్‌ ద్వారా బిఏ రాజు అటు సినీ పరిశ్రమకు ఇటు సినీ ప్రేమికులకు మధ్య వారధిగా నిలిచారు. మహేశ్ బాబు పీఆర్ఓగా పని చేశారు. సూపర్ స్టార్‌తో పాటు ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జునతో పాటు ఎంతో మంది సీనియర్, జూనియర్ హీరోలతో కలిసి పని చేశారాయన.

 ఆయన నిర్మాతగానూ చేశారు

ఆయన నిర్మాతగానూ చేశారు

ఫిలిం జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ఆరంభించిన బీఏ రాజు 'చంటిగాడు' అనే సినిమాతో నిర్మాతగానూ మారారు. దీని తర్వాత 'ప్రేమికులు', 'గుండమ్మ గారి మనవడు', 'లవ్‌లీ', 'సవాల్', 'వైశాఖం' అనే సినిమాలను చేశారు. ఇందులో ఎక్కువగా ఆయన భార్య ప్రముఖ దర్శకురాలు జయ తెరకెక్కించిన చిత్రాలే ఉన్నాయి. ఇక, ఈ మధ్య నిర్మాణ రంగానికి దూరంగా ఉంటూ వస్తున్నారాయన.

 రెండేళ్ల క్రితమే భార్య మరణం

రెండేళ్ల క్రితమే భార్య మరణం

బీఏ రాజు భార్య జయ ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. లేడీ దర్శకురాలిగా ఆమె ఎంతో మంది పేరును సంపాదించుకున్నారు. ఇక రెండేళ్ల క్రితమే ఆమె కూడా మరణించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం అంతగా సహకరించడం లేదు. ఈ క్రమంలోనే షుగర్ వ్యాధి ఎక్కువయిపోయినట్లు తెలుస్తోంది. ఇక, బీఏ రాజుకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

మహేశ్ ఎమోషనల్ పోస్ట్

మహేశ్ ఎమోషనల్ పోస్ట్

బీఏ రాజు చాలా కాలం నుంచి మహేశ్ బాబుకు పీఆర్ఓగా పని చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన మరణ వార్తను తట్టుకోలేకపోతున్నాడీ స్టార్ హీరో. ఇదే విషయాన్ని ట్వీట్ కూడా చేశాడు. 'బీఏ రాజు గారి మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. నా చిన్నప్పటి నుంచి తెలుసు. మేమిద్దరం చాలా కాలంగా కలిసి ఉన్నాం. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నా' అంటూ ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X