twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీకు ముఖ్యమైనది ఏంటో ఎంచుకోండి.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్

    |

    ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నం. అంతు చిక్కని వైరస్‌లు మానవజాతిపై విరుచుకుపడుతున్నాయి. తుఫాను, అడవిలో కార్చిచ్చు, భూకంపాలు ఇలా మానవాళిపై ప్రకృతి దాడి చేస్తోంది. ప్రకృతిని పరిరక్షిస్తే.. ఇలాంటి దారుణాలేవీ జరగవని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. ప్రకృతి గొప్పదనం చెప్పడానికి, పర్యావరణాన్ని రక్షించాలని ప్రతీ ఏటా జూన్ 5న అవగాహన కలిగిస్తుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మహేష్ బాబు తన అభిమానులకు ఓ సందేశాన్ని ఇచ్చాడు.

    ఈ మేరకు మహేష్ బాబు పోస్ట్ చేస్తూ.. దలైలామ కొటేషన్‌ను షేర్ చేశాడు. 'మనమందరం నివసించే పర్యావరణాన్ని పరిరక్షించడం.. మనందరి, వ్యక్తిగత బాధ్యత. - దలైలామా. ప్రకృతి, మనము ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాము. ప్రకృతిని రక్షించడం ద్వారా మనల్ని మనం రక్షించుకుంటాము. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ సవాళ్లు మానవ జీవితపు దుర్బలత్వాన్ని ప్రకటిస్తున్నాయి. మనందరం సంతోషంగా జీవించాలంటే, ఆరోగ్యకరమైన & సమతుల్య పర్యావరణ వ్యవస్థను సృష్టించడం చాలా ముఖ్యం.

    Mahesh Babu Emotional On World Environmental Day

    మనమందరం ఇంట్లో సురక్షితంగా ఉంటూ మన గొంతుకను ప్రపంచానికి వినిపించాలి. మన చేసే పనులు, మాటలు మారాల్సి ఉంది. భవిష్యత్తు మనపై ఆధారపడి ఉంది. నీటిని ఆదా చేయండి, చెట్లను కాపాడండి, విద్యుత్తును ఆదా చేయండి, కార్బన్ ఉద్గారాలను తగ్గించండి, అడవులను కాపాడండి, మన మహాసముద్రాలను కాపాడండి, జంతువులను రక్షించండి! మీకు ముఖ్యమైనది ఏమిటో ఎంచుకోండి! ఈ రోజు ప్రారంభించండి! దీన్ని కలిసి చేద్దామ'ని పిలుపునిచ్చాడు.

    Mahesh Babu Emotional On World Environmental Day

    English summary
    Mahesh Babu Emotional On World Environmental Day. he says that It is our collective and individual responsibility to preserve and tend to the environment in which we all live.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X