నాన్న.. మీరు ఎప్పటికీ సూపర్‌స్టారే.. మహేష్‌బాబు ఎమోషనల్ ట్వీట్
సూపర్‌స్టార్ కృష్ణ అంటే డేరింగ్, డాషింగ్ హీరో. నాలుగు దశాబ్దాలకుపైగా సినీ పరిశ్రమను ఏలిన నట కిశోరం. అలాంటి సినీ దిగ్గజం జన్మదినం మే 31. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అభిమానులు, సినీ ప్రముఖులు కృష్ణకు శుభాకాంక్షలు వెల్లడిస్తున్నారు. కానీ ప్రిన్స్ మహేష్ బాబు చేసిన ఎమోషనల్ ట్వీట్ అందర్ని ఆకర్షించింది.

నా రియల్ హీరో.. నా గురువు, నా ఆరాధ్యదైవం, నాకు ఆయన ఓ మూలస్థంభం. నా జీవితంలో అన్నీ ఆయనే. ఆయన కొడుకుగా పుట్టడం గర్వంగా భావిస్తాను. హ్యాపీ బర్త్ డే నాన్న. మీరు ఎప్పటికీ సూపర్‌స్టార్ అని ప్రిన్స్ మహేష్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











