»   » నిన్న సమంత-ఇపుడు మహేష్ బాబు.... బిజినెస్ ట్రిక్స్!

నిన్న సమంత-ఇపుడు మహేష్ బాబు.... బిజినెస్ ట్రిక్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొర్పొరెట్ కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయడం మామూలే. ఇలా ఎన్ని చేసినా...సినిమా తారలతో చేయించే ప్రచారం వల్ల ఆ వస్తువులకు వచ్చే డిమాండే వేరు. ఎంత పెద్ద స్టార్ అయితే అంత క్రేజ్. అందుకే వారికి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఇదంతా బిజినెస్ ట్రిక్స్.

తెలుగు సినిమా తారల విషయానికొస్తే.... సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎక్కువ కంపెనీలు డీల్ కుదుర్చుకున్నాయి. తాజాగా మరో కంపెనీ కూడా మహేష్ బాబుతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రముఖ పాదరక్షల కంపెనీ పారగాన్ తాజాగా మహేష్ బాబుతో డీల్ కుదుచ్చుకుంది.

Mahesh Babu to endorse Paragon

ఇప్పటికే పారాగాన్ సంస్థ లేడీస్ ధరించే చెప్పులకు ప్రచారం కల్పించడానికి సమంతతో డీల్ కుదుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇపుడు పురుషులు ధరించే చెప్పులకు మహేష్ బాబు ద్వారా ప్రచారం కల్పించనున్నారు. మహేస్ బాబు ఇప్పటి వరకు ఒక్క బాలీవుడ్ చిత్రంలోనూ నటించక పోయినా....ఆయనతో ఇండియా వైడ్ యాడ్స్ చేయడానికి పలు కార్పొరెట్ సంస్థలు ఆసక్తి చూపుతుండటం గమనార్హం.

పారగాన్ సంస్థ మహేష్ బాబుకు కోట్లలో రెమ్మూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే మహేష్ బాబు ఆ సంస్థ తరుపున ప్రచారం మొదలు పెట్టనున్నారు. అదే విధంగా వ్యాపార ప్రకటనల్లో కూడా నటించనున్నారు.

English summary
'Super Star' Mahesh Babu is the darling of many big brands. He has been endorsing a number of brands at present and the latest is that, he will be endorsing footwear brand, Paragon soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu