చుండ్రు నివారణకు కూడా మహేష్ బాబు ప్రచారం
ఇప్పటికే పలు బ్రాండులకు మోడల్‌గా ఉన్న మహేష్ బాబు తాజాగా మరో బ్రాండ్ కి అంబాసిడర్‌గా మారారు.ఇక నుంచీ వివిల్ యాంటీ డండ్రాఫ్ షాంపులు తదితర ప్రొడక్టులకు మహేష్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు.ఈ కొత్త కమిట్ మెంట్ ని మీడియాకు తెలియచేస్తూ...ఈ కంపెనీ తయారు చేస్తున్న ఐటమ్‌లను ప్రమోట్ చేస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నాను. ఈ ప్రొడక్ట్‌లు వెంట్రుకలకు, శరీరానికి ఎంతలా సౌందర్య పోషకాలుగా నిలుస్తాయో అని వివరిస్తానంటూ మాట్లాడారు.ఇక వివిల్ సబ్బులకు ఇప్పటికే త్రిష మోడల్‌గా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం మహేష్...శ్రీను వైట్లతో దూకుడు చిత్రం చేస్తున్నారు. అలాగే మణిరత్నం తో తమిళ,తెలుగు భాషల్లో రెడీ అయ్యే చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











