టి20 క్రికెట్ మ్యాచ్ కు ఎందుకు రాలేదంటే...మహేష్
పూనే నుంచి కారులో రెండు గంటల ప్రయాణం చేస్తే షూటింగ్ లొకేషన్ కు చేరుకోగలమని, ఈ కారణంగానే ఆదివారం హైదరాబాదులో జరిగిన టి-20 క్రికెట్ మ్యాచ్ కు రాలేకపోయానని కూడా మహేష్ బాబు తాజాగా ట్విట్టర్ లో పేర్కొన్నారు. 200 మందికి పైగా షూటింగ్‌లో పాల్గొంటున్నారని, ఒక్కరోజు తాను షూటింగ్ చేయకపోతే వారంతా నిరీక్షించవలసి వస్తుందని, అది జరిగితే నిర్మాతకు నష్టం వాటిల్లుతుందనే వుద్దేశంతోనే తాను హైదరాబాద్ రాలేకపోయినట్లు మహేష్ బాబు తెలిపారు. అలాగే గత కొన్ని రోజులుగా కంటిన్యూగా షూటింగ్ లో పాల్గొంటున్నందున తన కుమారుడు గౌతమ్‌తో కాలక్షేపం చేసే అవకాశం లేకుండా పోయిందని మహేష్ చెప్పారు. ప్రస్తుతం మహేష్ పూనే లో ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం క్లైమాక్స్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన అనుష్క హీరోయిన్ గా చేస్తోంది.
More from Filmibeat
అనుష్క మహేష్ బాబు త్రివిక్రమ్ గౌతమ్ పూనే anushka mahesh babu goutham t20 pune trivikram srinivas twitter


Click it and Unblock the Notifications











