మహేష్ బాబు ఫ్యామిలీ మొత్తం.... సెంటిమెంటా?
హైదరాబాద్: 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' షూటింగ్ పూర్తవడంతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి హాలిడేకు ప్లాన్ చేసారు. కొత్త సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో విదేశాల్లో అయితేనే బాగా ఎంజాయ్ చేయగలం అని భావించిన ఆయన ఈ మేరకు అందకు సన్నాహాలు చేసుకున్నారు.
మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్లు లోకల్‌గా ఉంటే న్యూఇయర్ సంబరాల్లో పాల్గొనడం కష్టమే. ఎందుకంటే వారికి భారీ సంఖ్యలో ఉన్న అభిమానులు వారిని ప్రశాంతంగా ఎంజాయ్ చేయనివ్వరు. ఇక వారి ప్రతి మూమెంట్‌ను కవర్ చేయడానికి మీడియా వారు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అందుకే పెద్ద స్టార్స్ అంతా ఫారిన్ టూర్ కే ఇంట్రస్టు చూపుతుంటారు. అక్కడైతే ఎలాంటి డిస్ట్రబెన్స్ ఉండదు... ఎంచక్క తనివితీరా ఎంజాయ్ చేయొచ్చు. మీడియా కన్ను తమపై ఉంటుందనే భయం కూడా ఉండదు.
కాగా.... మహేష్ బాబు తిరిగి జనవరి మొదటి వారంలో హైదరాబాద్ రానున్నారు. జనవరి 11న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో వారం రోజుల ముందు నుంచే మహేష్ బాబు ఈచిత్ర ప్రమోషన్లలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ మధ్య మహేష్ బాబు తన ప్రతి సినిమా షూటింగ్ ముగిసాక విదేశాలకు వెళ్లి అలా సేదతీరి వస్తున్నారు. దీంతో ఆయన విదేశాలకు వెళ్లిన వేళా విశేషమే సినిమాల విజయానికి కారణం అవుతుందనే ఓ పుక్కిటి పుకారు కూడా ప్రచారంలో ఉంది.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేసింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











