ఆకట్టుకుంటున్న మహేష్ బాబు ఫ్యామిలీ ఫోటోలు
హైదరాబాద్: మహేష్ బాబు కుటుంబం చూడముచ్చటైన కుటుంబం. ప్రస్తుతం బాబు తెలుగులో తిరుగులేని స్టార్. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అభిమాన సంఘాలు, ఫ్యాన్స్ వెబ్ సైట్లు, సోషల్ నెట్వర్కింగ్ పేజీలు ఇలా చాలానే నిర్వహిస్తున్నారు ఫ్యాన్స్.
మహేష్ బాబు ఫ్యామిలీకి, సినిమాలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా ఇట్టే క్షణాల్లో అభిమానులకు చేరిపోతుంది. ఇందుకోసం అభిమానులు ప్రత్యేక టీములుగా ఏర్పడి ఇంటర్నెట్ వెబ్ సైట్లు, సోషల్ నెట్వర్కింగ్ ఫ్యాన్ పేజీలు నిర్వహిస్తున్నారు. ఇదంతా మహేష్ బాబుపై అభిమానుల అభిమానం ఏరేంజిలో ఉంటుందో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు.
మహేష్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఫేర్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మహేష్ బాబు సినిమాలు మాత్రమే కాదు, ఇలాంటివి కూడా వారికి వినోదం పంచే విషయాలే.

మహేష్ బాబు ఫ్యామిలీ ఫోటోలు
మాజీ ఫెమీనా మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్‌ను ప్రేమించిన మహేష్ బాబు ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 10, 2005లో వీరి వివాహం ముంబైలో జరిగింది. పదేళ్ల వారి దాంపత్య జీవితంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు మహేష్, నమ్రత. ఆగస్టు 31, 2006న కుమారుడు గౌతంకృష్ణ జన్మించగా, జులై 20, 2012న కూతురు సితార జన్మించింది.

నిరాడంబరంగా
పెద్దలను ఎదురించి చేసుకునే ప్రేమ వివాహం కావడంతో మహేష్ బాబు, నమ్రత వివాహం ముంబైలో నిరాడంబరంగా జరిగింది.

డేటింగ్
మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ‘వంశీ' అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మొదలైన స్నహం ఆ తర్వాత ప్రేమగా మారింది. పెళ్లికి ముందు దాదాపు ఐదేళ్లు డేటింగ్ చేసారు.

చూడముచ్చటైన కుటుంబం
టాలీవుడ్లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులు అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. వీరి చూటముచ్చటైన కుటుంబం.


Click it and Unblock the Notifications