మహేష్ బాబు హాలీడే ట్రిప్.. నమ్రతతో కలిసి అలా అలా!! సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబానికి ఎంత విలువిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబంతో సరదాగా గడపడం, భార్యా బిడ్డలతో కలిసి విదేశాలకు వెళ్లి కొన్ని రోజులు ఎంజాయ్ చేయడం మహేష్ బాబుకు అలవాటు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఓ ఫారెన్ టూర్ వేసిన మహేష్.. అందుకు సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ సందేశం పోస్ట్ చేశారు. వివరాల్లోకి పోతే..

మహేష్ బాబు హాలీడే ట్రిప్.. నమ్రతతో కలిసి

మహేష్ బాబు హాలీడే ట్రిప్.. నమ్రతతో కలిసి

ఇటీవలే సరిలేరు నీకెవ్వరు రూపంలో భారీ సక్సెస్ సాధించి మంచి జోష్‌లో ఉన్నాడు మహేష్ బాబు. ఈ మేరకు తన కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్ ప్లాన్ చేసిన ఆయన.. ప్రస్తుతం న్యూ యార్క్, దుబాయ్, చికాగో నగరాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్ బాబు. భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సీతారాలతో కలిసి ఫారెన్ వీధుల్లో షికారు చేస్తున్నారు.

మహేష్ సోషల్ మీడియా పోస్ట్..

మహేష్ సోషల్ మీడియా పోస్ట్..

అయితే ఆ ట్రిప్ తాలూకు పిక్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్న మహేష్.. ఫ్యామిలీతో కలిసి దిగిన ఓ పిక్ షేర్ చేసి ఆకట్టుకున్నాడు. ఈ మేరకు తన ఇన్నేళ్ల జర్నీని చూస్తుంటే ఆనందంగా ఉందని.. అయితే ఈ ప్రయాణం తన ఒక్కడిది కాదని, ఒక్కడినైతే ఇంత దూరం రాలేనని పేర్కొన్నాడు సూపర్ స్టార్. తనకు తన కుటుంబమే బలమని అన్నాడు మహేష్.

ఎంతో ఆనందంగా నమ్రత.. కొడుకు గౌతమ్, కూతురు సితార

ఎంతో ఆనందంగా నమ్రత.. కొడుకు గౌతమ్, కూతురు సితార

తన కుటుంబం లేకపోతే తాను లేనంటూ ఫ్యామిలీ ఫోటో పోస్ట్ చేశాడు సూపర్ స్టార్ మహేష్బాబు. ఈ కొడుకు గౌతమ్, కూతురు సితారఫొటోలో మహేష్ సతీమణి నమ్రత, అలాగే ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ ట్రిప్ ముగించుకొని ఇండియాకు రానున్నాడు మహేష్. ఈ ఫొటో చూసి ఆయన అభిమానులు ఎంజాయ్ మై ఫెవరెట్ హీరో అంటూ రియాక్ట్ అవుతున్నారు.

సరిలేరు నీకెవ్వరు.. దేశ విదేశాల్లో మహేష్ సత్తా

మరవైపు సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ బాబు దేశ విదేశాల్లో సత్తా చాటుతున్నాడు. జనవరి 11న విడుదలైన ఈ సినిమా ఇండియాతో పాటు ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ రాబడుతూ సత్తా చాటుతోంది. ఇప్పటికే 130 కోట్లు క్రాస్ చేసి నిర్మాతలను లాభాల బాటలో నడిపిస్తోంది. దీంతో సరిలేరు నీకెవ్వరు యూనిట్ అంతా ఫుల్ ఖుషీలో ఉంది.

 మళ్ళీ అదే రిపీట్.. కియారాతో రొమాన్స్

మళ్ళీ అదే రిపీట్.. కియారాతో రొమాన్స్

ఇకపోతే మహేష్ తన తదుపరి సినిమా బాధ్యతలను మరోసారి వంశీ పైడిపెల్లి చేతిలో పెట్టాడు. ఆయన దర్శకత్వంలో తన 27వ సినిమా చేయబోతున్నాడు. ఫారెన్ ట్రిప్ ముగియగానే ఈ సినిమా స్టార్ట్ చేస్తారని సమాచారం. ఇందులో మహేష్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే మహేష్- వంశీ పైడిపెల్లి కాంబోలో వచ్చిన ''మహర్షి'' సూపర్ డూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X