GunturKaaram: దారుణానికి పాల్పడిన మహేశ్ బాబు అభిమాని.. పరాకాష్టకు అభిమాని అతి!
హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్... ఏ ప్రాంత హీరోలకైనా ఫ్యాన్స్ ఉండటం సహజం. అయితే మన దగ్గర మాత్రం ఏ హీరోను లేదా హీరోయిన్ ను, దర్శకులకు నెక్ట్స్ లెవెల్ అభిమానులు ఉంటారు. మన వాళ్లకు మాత్రం డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. తాజాగా మహేశ్ బాబు వీరాభిమాని బ్లేడుతో చేయి కోసుకున్నాడు. అంతేనా మహేశ్ బాబుకు రక్త తిలకం దిద్దాడు. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన చిత్రం 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా... రమ్యకృష్ణ, జయరాం, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థమన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు. ఇక ఈ సినిమాలోని పాటలు ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతిత తెలిసిందే.

ఇక మొదటి రోజు ఈ సినిమా 90 కోట్లకు పైగా కలెక్ట్ చేయగా... రెండో రోజు మాత్రం భారీగా తగ్గాయి. రెండు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.124 కోట్లు వచ్చాయి. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్.. విషయానికి వస్తే... నైజాంలో రూ. 42.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.12 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.44 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 102.12 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.01 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20.11 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132కు పైగానే కోట్లు బిజినెస్ జరుపుకుంది.
ఈ లెక్కన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే బాగానే కలెక్ట్ చేయాలి. మరి ఆ విషయం పక్కన పెడితే.. సినిమా ఎలా ఉన్నా.. ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ చూసిినా మహేశ్ బాబు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. దండలు వేస్తున్నారు. అయితే ఏ హీరోకు అయినా ఫ్యాన్స్ ఉంటే మహేష్ బాబుకు మాత్రం డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.

గుంటూరు కారం సినిమా రిలీజ్ అయిన క్రమంలో అభిమానులు థియేటర్ల వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఓ వీరాభిమాని చేసిన పనికి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఓ వీరాభిమాని తన చేయిని బ్లేడుతో కోసుకొని మహేశ్ ఫ్లెక్సీకి రక్తతిలకం దిద్దాడు. భారీ కటౌట్ ఉండగా.. దానిపైకి ఎక్కి మరీ.. ఆ వీరాభిమాని తన చేయిని మూడు నాలుగు సార్లు చేయిని కోసుకున్నాడు. ఆ తర్వాత ఆ రక్తంతో ఫ్లేక్సీకి తిలకం దిద్దాడు.
ప్రస్తుతం ఆ డై హార్ట్ ఫ్యాన్ చేసిన పనిని కొందరు వీడియో తీయగా... అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంత మంది నెటిజన్లు అతనిపై ఫైరవుతున్నారు. ఇలాంటివి మహేశ్ బాబుకు నచ్చవని, ఆయన వేలాది మంది చిన్నారుల ప్రాణాలు కాపాడే వ్యక్తి అని కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











