అతిథి టికెట్లు బ్లాక్-కాంగ్రెస్ నాయకుడి ఇంటిపై దాడి
సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నాడని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాంబాబు ఇంటిపై మహేష్ బాబు అభిమానులు బుధవారం ఉదయం దాడిచేశారు. ఇంటి తలుపులు పగలకొట్టడానికి వారు తీవ్రంగా ప్రయత్నించారు. మహేష్ బాబు, అమృతారావు హీరోహీరోయిన్లుగా రూపొందిన అతిథి సినిమా గురువారం విడుదల అయింది. ఈ సందర్భంగా హైదారాబాద్ లోని కాచిగూడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు రాంబాబు సినిమా టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్నట్టు తెలిసిన మహేష్ బాబు అభిమానులు ఆయన ఇంటివద్దకు చేరి నానా హంగామా చేశారు. తలుపులు విరగగొట్టడానికి ప్రయత్నించారు. ఇంటిముందు గుంపుగా చేరి రాంబాబు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


Click it and Unblock the Notifications











