మహేష్ బాబుని చూడ్డానికి ఎగబడ్డ జనం...లాఠీఛార్జి
తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్న థమ్సప్ కంపెనీ నిర్వహించిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం రాత్రి 9.30కు హైదరాబాద్ అత్తాపూర్ గోల్డెన్ ప్యాలెస్ రెస్టారెంట్‌కు మహేశ్ వచ్చారు. అప్పటికే అభిమానుల రాకతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దీంతో ముందుగా నిర్ణయించిన ప్రదేశంలో కాకుండా వేరొక హాలులో కార్యక్రమం నిర్వహించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనూ అభిమానుల సంఖ్య పెరగడంతో తొక్కిసలాట జరిగింది. వీరిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ చార్జి చేయాల్సివచ్చింది. చివరకు వారి బారి నుంచి తప్పించుకోవడానికి ప్రిన్స్‌ను వెనక ద్వారం నుంచి పంపించాల్సి వచ్చింది. అంతకు ముందు మహేష్ ప్యారడైజ్‌లో తళుక్కుమన్నారు. థమ్స్‌అప్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఇక్కడకు వచ్చిన ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో కారు ఎక్కేందుకు కూడా ఇబ్బంది పడ్డారు.అలాగే పాపం అభిమానులుకూడా పోలీసుల లాఠీ దెబ్బలు తిని ఇంటిబాట పట్టారు.


Click it and Unblock the Notifications











