ఇది ప్రపంచ రికార్డ్.. కొత్త చరిత్ర లిఖించిన మహేష్ ఫ్యాన్స్.. ఎన్ని మిలియన్ల ట్వీట్లు చేశారంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే మామూలు విషయం కాదు. మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ మరేతర దక్షిణాది స్టార్‌కు లేరు. మహేష్ బాబుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. దానికి కారణం సూపర్ స్టార్ ఫాలోవర్సే. మరి అలాంటిది మహేష్ బాబు బర్త్ డేను అంత తేలిగ్గా వదిలేస్తారా? ప్రపంచం మొత్తం తలెత్తి చూసేలా చేయరూ. ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ అదే చేశారు. మహేష్ బర్త్ డేను ప్రపంచం మొత్తం తెలిసేలా ట్రెండ్ చేశారు.. ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

స్టార్స్ ప్రస్టేజ్ ఇష్యూ..
ఒకప్పుడంటే.. వంద రోజులు రెండొందల రోజులు అని కాలర్ ఎగిరేసేవారు. ఆపై ఇన్ని సెంటర్లలో అన్ని రోజులు ఆడిందని గొప్పగా చెప్పుకునే వారు. ఇప్పుడు వంద కోట్లు, 150కోట్లు అంటూ లెక్కలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అయితే మారిన పరిస్థితుల ప్రకారం సోషల్ మీడియాలో రికార్డులే స్టార్స్ ఇమేజ్‌ను లెక్కలేస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాన్స్‌కు ఇది ప్రస్టేజ్ ఇష్యూలా మారింది.

ఫ్యాన్స్ మధ్య పోటీ..
సోషల్ మీడియా రికార్డుల విషయంలో ముఖ్యంగా మహేష్ బాబు, దళపతి విజయ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య గొడవలు వస్తుంటాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని తపిస్తుంటారు. అందుకే ఆ మధ్య ఏ సందర్భం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డేను ట్రెండ్ చేశారు. అది చూసి మహేష్ ఫ్యాన్స్ ఆ రికార్డులన కొల్లగొట్టారు.

మహేష్ ఫ్యాన్స్ రచ్చ..
ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ మాత్రం ప్రపంచ రికార్డు కొట్టేశారు. నిన్న సాయంత్రం ఆరు గంటలకు మొదలెట్టిన ఈ యుద్దాన్ని నేటి సాయంత్రం ఆరింటికి వీడారు. ఈ మధ్యలో అలుపు లేకుండా ట్వీట్ల మీదు ట్వీట్లు చేసి సోషల్ మీడియాను షేక్ చేశారు.

పది మిలియన్ల రికార్డు..
ప్రపంచంలో అతి వేగంగా పది మిలియన్ల ట్వీట్లు చేసిన రికార్డును మహేష్ బాబు ఫ్యాన్స్ నెలకొల్పారు. నిన్న సాయంత్రం మొదలు పెట్టిన ఈ కార్యక్రమంలో మొదటి అర్దగంటలో 3.5 మిలియన్ల ట్వీట్లు కొల్లగొట్టి మరో రికార్డును నెలకొల్పారు. ఇలా మొత్తంగా 24 గంటల్లొ మరేతర హీరోల అభిమానులు సాధించలేని ఘనతను సాధించారు.

60 మిలియన్ల ట్వీట్లతో..
ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ మహేష్ బాబు ఫ్యాన్స్ చెరిపేశారు. నయా ఇతిహాస్ లిఖేగా అన్నట్టు 24 గంటల్లో 60.2 మిలియన్ల ట్వీట్లతో ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. #HBDMaheshBabu ప్రపంచంలోనే అత్యధిక ట్వీట్లు చేసిన హ్యాష్ ట్యాగ్‌గా 60.2 మిలియన్లతో మొదటి స్థానంలో ఉంటే.. ఇంతవరకు నెం.1 స్థానంలో ఉన్న హ్యాష్ ట్యాగ్ #TwitterBestFandom రెండో స్థానంలోకి వచ్చేసింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ కొత్త చరిత్రకు తెరదీసినట్టు కాలర్ ఎగిరేస్తున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











