మహేశ్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన రాజమౌళి.. బర్డ్ డే రోజున ప్రపంచ రికార్డు కొట్టినా..

By Manoj

కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. అదే సమయంలో తన మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఫ్యూచర్‌లో భారీ ప్రాజెక్టులతోనే రావాలని డిసైడ్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే బడా డైరెక్టర్లతో సినిమాలకు ఓకే చెబుతున్నాడు. ఇదిలాఉండగా... ఆగస్టు 9న మహేశ్ తన 45వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతడి ఫ్యాన్స్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అయినప్పటికీ వాళ్లకు నిరాశ తప్పలేదు. దీనికి కారణం రాజమౌళినే అన్న టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు మీకోసం.!

Recommended Video

#HBDMaheshBabu : 8 Reasons Behind Mahesh Babu Craze | Sarkaru Vaari Paata || Oneindia Telugu
 హ్యాట్రిక్‌తో పాటు ఇండస్ట్రీ హిట్‌ సొంతం

హ్యాట్రిక్‌తో పాటు ఇండస్ట్రీ హిట్‌ సొంతం

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ఈ క్రమంలోనే ఈ మధ్య అతడు ‘భరత్ అనే నేను', ‘మహర్షి' వంటి హిట్లను అందుకున్నాడు. వీటితో పాటు ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు'తో హ్యాట్రిక్ సాధించడంతో పాటు ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఒకరితో అనుకుంటే ఇంకొకరితో సెట్

ఒకరితో అనుకుంటే ఇంకొకరితో సెట్

‘సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ హిట్‌తో మహేశ్ బాబు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లితో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ విషయాన్ని సదరు దర్శకుడే స్వయంగా ప్రకటించాడు. కానీ, ఊహించని విధంగా ఈ మూవీ సెట్ కాలేదు. అదే సమయంలో సూపర్ స్టార్ మరో డైరెక్టర్ పరశురాంతో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.

వాళ్లను టార్గెట్ చేయబోతున్న ప్రిన్స్

వాళ్లను టార్గెట్ చేయబోతున్న ప్రిన్స్

పరశురాం దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట'. అప్పులు తీసుకుని బ్యాంకులను మోసం చేస్తున్న వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్‌టైనర్స్‌తో కలిసి మహేశ్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా కీర్తీ సురేష్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఫ్యాన్స్

ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఫ్యాన్స్

మహేశ్ బాబు పుట్టినరోజును పురస్కరించుని అతడి అభిమానులు ఏకంగా ప్రపంచ రికార్డును నెలకొల్పారు. #HBDMaheshBabu అనే హ్యాష్ ట్యాగ్‌తో ఆగస్టు 8 సాయంత్రం 6 గంటల నుంచే ట్రెండ్ స్టార్ట్ చేశారు. 24 గంటలు ముగిసే సరికి ఈ ట్యాగ్‌తో ఏకంగా 60.2 మిలియన్ల ట్వీట్లు వచ్చాయి. దీంతో ట్విట్టర్‌లో అత్యధిక ట్వీట్లు సాధించిన హ్యాష్‌ ట్యాగ్‌గా చరిత్ర సృష్టించింది.

ఆ డైరెక్టర్... సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడని

ఆ డైరెక్టర్... సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడని

‘సర్కారు వారి పాట' తర్వాత మహేశ్... దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఆగస్టు 9న వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు, ఈ విషయాన్ని రాజమౌళినే స్వయంగా ట్వీట్ చేస్తాడని కూడా అన్నారు. దీంతో మహేశ్ బర్త్‌డేన రెండు పండుగలు ఉంటాయని ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.

ఫ్యాన్స్‌లో నిరాశ.. అసలు కారణం ఇదే

ఫ్యాన్స్‌లో నిరాశ.. అసలు కారణం ఇదే

ప్రపంచ రికార్డు నెలకొల్పినా మహేశ్ బాబు అభిమానుల్లో ఓ లోటు కనిపించింది. అదే రాజమౌళి నుంచి ఎటువంటి అప్‌డేట్ రాకపోవడం. అంతేకాదు, ఆయన అసలు మహేశ్‌ను విష్ కూడా చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. వాస్తవానికి రాజమౌళి కరోనా వ్యాధితో బాధపడుతున్నారు. ఈ కారణంగానే ఆయన నుంచి విష్, సర్‌ప్రైజ్ రాలేదని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X