తేజకి మహేష్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్.. మానిపోయిన కాంట్రవర్సీ రేపడం తగునా తేజ?
సినిమా బాక్సాఫీస్ దగ్గర పలు సినిమాల క్లాష్ అనేది ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. మెయిన్ గా పండుగల సమయంలో అయితే గతంలోకి కలిసి పని చేసిన హీరోలు ఆర్టిస్టులు దర్శకులు కూడా ఆ క్లాష్ తో వేరయిపోతారు. అయితే ఇది అందరికీ నచ్చకపోవచ్చు కానీ ఇండస్ట్రీలో మాత్రం ఇపుడు పరిస్థితులు ఈ రకంగా మారిపోతున్నాయని చెప్పక తప్పదు.
కాగా ఈ 2024 ఏడాదిలోనే మొదటి పెద్ద పండుగ సంక్రాంతి రేస్ పెద్ద ఎత్తున కాంట్రవర్సీలు సింపతీ నడుమ మొదలైంది. కాగా ఈ ఏడాది సంక్రాంతిలో యువ హీరో తేజ సజ్జ నటించిన భారీ పాన్ ఇండియా సినిమా "హను మాన్" దీనితో పాటుగా సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ సినిమా "గుంటూరు కారం" వచ్చాయి.

అయితే వీటిలో మొదటిగా జనవరి 12 డేట్ ని లాక్ చేసుకున్నది హను మాన్ చిత్ర బృందమే వీరి తర్వాతే గుంటూరు కారం అనౌన్స్ చేశారు. ఎలా చూసుకున్నా మహేష్, త్రివిక్రమ్ లాంటి కాంబినేషన్ ముందు హను మాన్ చిన్న సినిమా గానే కనిపించింది. దీనితో అలా అప్పుడు పలు కాంట్రావర్సిల నడుమ రెండు సినిమాలు వచ్చాయి. అయితే వీటిలో హను మాన్ భారీ వసూళ్లు సాధిస్తే గుంటూరు కారం యావరేజ్ గా మిగిలిపోయింది.
కాగా ఇక్కడ కూడా హను మాన్ సినిమాకి తక్కువ థియేటర్స్ దొరికాయి అని చిత్ర యూనిట్ కూడా కొంచెం అసహనం వ్యక్తం చేసేసరికి అక్కడ నుంచి యువ హీరో తేజ సజ్జ సహా దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా మహేష్ అభిమానుల్లో విలన్స్ అయ్యారు. కాగా అదే పెద్ద ఇష్యూ అనుకుంటే కొన్ని రోజులు కితమే నాగవంశీ కూడా హను మాన్ టైం లో జరిగిన క్లాష్ కోసం చేసిన పలు కామెంట్స్ వైరల్ అయ్యాయి.

కానీ లేటెస్ట్ గా యువ హీరో తేజ షహ మరోసారి మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహానికి బాధితుడు అయ్యాడు. కాగా ఇటీవల జరిగిన ఐఫా అవార్డు వేడుకల్లో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా తన సినిమా క్లాష్ కోసం కొన్ని వ్యంగ్యాస్త్రాలు రానాతో కలిసి పేల్చాడు. దీనితో సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేజ సహా రానాని కూడా దూషిస్తూ ఇద్దరు మా హీరో రేంజ్ మార్కెట్ లేనివాళ్లు మా హీరోని అంటారా అంటూ ఊగిపోతున్నారు.
అలాగే తేజ సజ్జ మహేష్ బాబుకి క్షమాపణ కూడా చెప్పాలని వారు అంటున్నారు. ఇలా మరోసారి అయితే తేజ సజ్జ విషయంలో అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ యువత సోషల్ మీడియా అంతా ఇదే రచ్చ నడుస్తుంది. కాగా దీనిపై తేజ కానీ రానా దగ్గుబాటి కానీ ఏమన్నా వివరణ ఇస్తారా లేదా అనేది కూడా మరింత ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఆల్రెడీ తేజ అంటే పీకల్లోతు కోపంలో మహేష్ ఫ్యాన్స్ ఉన్నారు. మళ్ళీ ఈ రకంగా కెలుక్కోవడం అనేది తేజ కూడా ఆలోచించుకోవాలి మరి.


Click it and Unblock the Notifications











