మహేష్ ఇంట కరోనా కలకలం.. మొన్ననే ఆ ఫోటో.. దీంతో టెన్షన్ లో మహేష్ ఫ్యాన్స్!

మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. సినీ పరిశ్రమలో ప్రపంచంలో కూడా చాలా మంది స్టార్స్ కరోనా బారిన పడ్డారు. ఇటీవల, కపూర్ కుటుంబంలోని చాలా మంది సభ్యులు కరోనా పాజిటివ్‌గా ఉన్నారని తేలింది. ఇప్పుడు మరో బాలీవుడ్ వ్యక్తి కరోనా బారిన పడ్డారు. అయితే మహేష్ ఫ్యాన్స్ లో మాత్రం టెన్షన్ నెలకొంది. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

Mahesh Babu To Undergo Surgery | SSMB Response On Akhanda
బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన

బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన

భారతదేశంలో, ముఖ్యంగా మహారాష్ట్రలో, కోవిడ్ -19 కేసులు మరోసారి పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం, రాష్ట్రంలో బుధవారం 3, 900 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, ఇందులో ఓమిక్రాన్ విషయంలో 85 తేలారు. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు కూడా కరోనా బారిన పడ్డారు. అర్జున్ కపూర్, అన్షులా కపూర్, రియా కపూర్ మరియు కరణ్ బూలానీల కరోనా రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చింది. అందరూ హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

సురక్షితంగా ఉండం

సురక్షితంగా ఉండం

బాలీవుడ్ నటి, టాలీవుడ్ హీరో మహేష్ బాబు వదిన శిల్పా శిరోద్కర్ కోవిడ్ 19 (కరోనా పాజిటివ్) బారిన పడ్డారు. బుధవారం అర్థరాత్రి, శిల్పా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా కరోనా సోకిందని తెలియజేశారు. నటి మాట్లాడుతూ 'నాలుగు రోజుల క్రితం నాకు కరోనా వచ్చింది. అందరూ ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండండి' అని పేర్కొంది.

మాస్క్ ధరించండి

మాస్క్ ధరించండి

ఇక అదే సమయంలో, నటి వ్యాక్సిన్ తీసుకోవడం గురించి కూడా దేశ ప్రజలకు కూడా అవగాహన కల్పించింది. మీకు ఏది మంచిదో మీ ప్రభుత్వానికి తెలుసు అని శిల్పా శిరోద్కర్ అన్నారు. టీకాలు వేసుకోండి, మాస్క్ ధరించండి మరియు సురక్షితంగా ఉండండని పేర్కొంది.

మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్

మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్


కోవిడ్ 19 (కరోనా) వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి భారతీయ సినీ సెలబ్రిటీ శిల్పా శిరోద్కర్. ఎందుకంటే ఆమె నివాసం దుబాయ్ లో కాబట్టి ఆమెకి ఈ ఏడాది జనవరిలోనే వ్యాక్సిన్ ఫాస్ట్ డోస్ లభించింది. శిల్పా తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో నివాసం ఉంటోంది.

దుబాయ్‌లో విశ్రాంతి

దుబాయ్‌లో విశ్రాంతి

'హమ్', 'ఖుదా గవా' మరియు 'ఆంఖేన్' వంటి చిత్రాల్లో నటించిన శిల్పా శిరోద్కర్ మహేష్ బాబు సోదరి నమ్రతా శిరోద్కర్ కు స్వయానా అక్క. అయితే ఇప్పుడు ఆమెకు కరోనా సోకితే మహేష్ ఫ్యాన్స్ కు టెన్షన్ ఏమిటి? అని అనుకుంటున్నారా? అయితే మీకు మహేష్ బాబు దుబాయ్ వెళ్లిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆయన మోకాలికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న క్రమంలో స్పెయిన్‌లో సర్జరీ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే అయన ప్రస్తుతం దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

వదినకు కరోనా సోకడంతో

వదినకు కరోనా సోకడంతో

దాదాపు రెండు నెలల పాటు మహేష్ బాబుకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో సర్కారు వారి పాట షూటింగ్‌కు సుధీర్ఘంగా బ్రేక్ తీసుకుని దుబాయ్ వెళ్లారు. సెలవుపై దుబాయ్ వెళ్లిన మహేష్ బాబును అక్కడ భీమ్లా నాయక్ టీమ్ ని కలిసింది. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా గురించి చర్చించేందుకు మహేష్ బాబు కలిసి నట్లు ప్రచారం జరిగింది. ఆయన దుబాయ్ లోనే ఉండడం, ఇప్పుడు ఆయన వదినకు కరోనా సోకడంతో మహేష్ ఫాన్స్ టెన్షన్ పడుతున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X