లక్ష ‘బిజినెస్ మేన్’లతో... వినూత్న ప్రచారం
మహేష్ బాబు తాజా సినిమా 'బిజినెస్ మేన్' విడుదల సందర్భంగా అభిమానులు వినూత్న ప్రచారం మొదలు పెట్టారు. గాలి పటాలకు ఫేమస్ అయిన సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని 'బిజినెస్ మేన్' లోగోలు, మహేష్ బాబు ఫోటోలతో కూడిన లక్ష గాలి పటాల(కైట్స్)ను సంక్షేమ హాస్టల్స్, మురికి వాడల్లోని పిల్లలకు పంపిణీ చేస్తున్నారు. మహేష్ అభిమాన సంఘం అధ్యక్షుడు దిడ్డి రాంబాబు నేతృత్వంలో ఈ గాలి పటాల పంపిణీ జరుగుతోంది.
మహేష్ బాబు, కాజల్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'బిజినెస్ మేన్' సినిమా రూపొందింది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్నారు. ముంబై మాఫియా, ఆయుధాల వ్యాపారం కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించి థమన్ అందించిన సంగీతం ఇప్పటికే మంచి విజయం సాధించింది.
భాయ్(డాన్)కావాలనే లక్ష్యంతో హీరో ముంబై చేరుకుంటాడు. దావూద్, ఇతర డాన్లు సిటీని విదిలిపెట్టిన తర్వాత ముంబైలో డాన్ లేడని ఫీలయ్యే యువకుడు, డాన్ గా ఎలా ఎదిగాడు అనే పాయింట్ ను ఈ సినిమా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 13న బిజినెస్ మేన్ సినిమా తెలుగు సినిమా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 2 వేల షోలతో గ్రాండ్‌గా విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











